మనిషికి జీవితంలో రెండే రెండు బాధలు ఉంటాయి. ఒకటి క్రమశిక్షణ పాటించడం వాళ్ళ వచ్చే బాథ మరొకటి అసలు క్రమశిక్షణ లేకుండా ఉండటం వల్ల వచ్చే బాథలు. ఒక గుర్రాన్ని పరుగులు పెట్టించాలి అంటే ఆ గుర్రం కళ్ళెం బిగించి పట్టుకోవాలి. అదేవిధంగా మనలో ఉన్న ప్రతిభా పాటవాలు శక్తి సామధ్యాలు రాణించాలి అంటే క్రమ శిక్షణ చాల అవసరం.


వాస్తవానికి క్రమ శిక్షణకు సంబంధించిన విషయాల పై ఇప్పటికీ చాలామందికి అవగాహన లేదు. మనం చేయవలసిన పనిని ఇష్టమైనా-కష్టమైనా అనుకున్న సమయానికి పూర్తి చేయడమే క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ ఉన్న వ్యక్తి దగ్గర మాత్రమే సంపద వచ్చి చేరుతుంది. ఇతరులతో పని చేయించడం చాల తేలిక. అయితే మనకు మనం పని చేసుకోవడం చాల కష్టమైన పని. అలా పని చేసుకోగల వ్యక్తికి చాల క్రమశిక్షణ ఉండాలి.


ఆ క్రమశిక్షణ తోనే విజయంతో పాటు సంపద వచ్చి చేరుతుంది. మన జీవితాలకు సంబంధించిన ప్రతి విషయం క్రమశిక్షణ తో ముడిపడి ఉంటుంది. పరీక్షలలో మంచి ఫలితాలు రావాలి అంటే బాగా కష్టపడి చదువుకోవాలి. మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే వ్యాయామం చేయాలి. అదేవిధంగా సంపదను గణించాలి అంటే ప్రతివ్యక్తికి ఎంతోకొంత ఆర్ధిక విజ్ఞానం పై పట్టు ఉండాలి.


ప్రస్తుత సమాజంలో చాలామందికి స్వీయ క్రమశిక్షణ చాల తక్కువగా ఉంటుంది. ప్రపంచ సంపన్నుల జాబితాలో అగ్ర స్థానంలో కొనసాగుతున్న ముఖేష్ అంబానీ తన వ్యాపార కార్యక్రమాలు చూసుకోవడం కోసం ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి తన సంస్థ ఉన్నత ఉద్యోగులకు అందుబాటులో ఉంటాడు అని తెలిస్తే  ఎవరైనా షాక్ అవుతారు. వాస్తవానికి డబ్బు సంపాదన విషయంలో వెనకపడే వ్యక్తులు ఎవరో ఒకరు తమను నిరంతరం నియంత్రించాలని కోరుకుంటారు. అయితే డబ్బు సంపాదనలో పేరు గాంచిన అనేక మంది పారిశ్రామిక వేత్తలు తాము అంతా తమ స్వీయ నియంత్రణ వల్ల పైకి ఎదిగామని చెపుతూ ఉంటారు. అందుకే డబ్బుకు సంబంధించిన లక్ష్మణ రేఖను దాట కుండా ప్రవర్తించగలిగిన వారు మాత్రమే ఐశ్వర్య వంతులు అవ్వగలరు..

మరింత సమాచారం తెలుసుకోండి: