యుద్ధాలు దేశాల మధ్య స్వార్థ పూరిత కారణాలతో వస్తూ ఉంటాయి. అయితే ప్రతి వ్యక్తి తన మనుగడ కోసం తన జీవితంలో అనేకమంది శతృవులతో చేయవలసి వస్తుంది. ఆ శతృవులు కేవలం వ్యక్తులు మాత్రమే కాదు పరిస్థితులతో కూడ ఉంటుంది. ఈ జీవన యుద్ధంలో ఆయుధాలు ఉండవు. కేవలం ఆలోచనలు మాత్రమే ఉంటాయి.


మన చుట్టూ ఉన్న సమస్యలు ఎప్పుడు మరణించవు. ఒక సమస్య తరువాత మరొక సమస్య వస్తూనే ఉంటుంది. వాటితో పోరాటం చేయడం తప్ప మరొక మార్గం ఎంతటి గొప్ప వ్యక్తికి కూడ ఉండదు. సరైన పద్ధతిలో చదువు రాకపోవడం ఆ తరువాత ఉద్యోగ సమస్య ఆర్ధిక సమస్యా వివాహ సమస్య ఆర్ధిక సమస్య ఇలా అనేక సమస్యలు అనుక్షణం మనిషిని వెంటాడుతూనే ఉంటాయి. అందుకే సమస్యకు లొంగిపోతే ఇక జీవితంలో విజయం ఉండదు అని అంటారు.


సంపాదించిన డబ్బు అంతా షేర్ మార్కట్ లో పోగొట్టుకుని తిరిగి పాన్ షాప్ పెట్టుకుని డబ్బు గణించిన వారు అనేకం మంది ఉన్నారు. అయితే ఇలా ఆ వ్యక్తులు విజేతలుగా మారడానికి వారి ముఖంలో కనిపించే ప్రశాంతత పెదవుల పై నిరంతరం కనిపించే చిరునవ్వు ప్రధాన కారణాలుగా పేర్కొన వచ్చు. వాస్తవానికి సమస్యకు కష్టానికి మధ్య చాల తేడా ఉంది. పరిష్కారం లేనిది కష్టం అయితే పరిష్కారం ఉన్నది సమస్య.


‘జీవితంలో యుద్ధం ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడే జీవితం పై నిరాశ ప్రారంభం అవుతుంది’ అని అంటారు. ఇది ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన అన్ని రంగాలకు వర్తిస్తుంది. విజయమే అంతిమ లక్ష్యంగా ఎప్పుడు నిరంతరం సంతోషంగా ఉండే వ్యక్తులు మాత్రమే ఐశ్వర్య వంతులు కాగలుగుతారు. ఈ విషయాలు అన్నీ ‘ది ఆర్ట్ ఆఫ్ వార్’ అనే పుస్తకంలో మనకు కనిపిస్తాయి. శత్రువు అంటే వ్యక్తులు మాత్రమే కాదు సమస్య చిరాకు అసంతృప్తి మనిషి జీవితంలో ఇవన్నీ కూడ శతృవులే వీటితో యుద్ధం చేసి గెలిచిన వ్యక్తి మాత్రమే ఐశ్వర్య వంతుడు..

మరింత సమాచారం తెలుసుకోండి: