మనిషి విజయసాధనలో కీలకంగా ప్రభావితం చేసేది మానవ మేధస్సు. సృష్టిలో ఏపని అయినా మానవ మేధస్సు తో చేయవచ్చు. మానవ మేధస్సుల పరస్పర కరచాలన ఫలితం ద్వారానే సంపద సృష్టింపబడుతుంది. మానవ కృషి సాధించలేని విషయం ఈ ప్రపంచంలో ఏది లేదు. చాలామంది ఒక పని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు తమకు అలాంటి పనిచేసే శక్తిలేదు అని మధన పడుతూ ఉంటారు. 


ప్రపంచ వింతలలో ఒకటిగా ఇప్పటికీ కొనసాగుతున్న తాజ్ మహల్ నిర్మాణం కేవలం మానవ మేధస్సుతో ఎలాంటి టెక్నాలజీ లేని పరిస్థితులలో నిర్మించిన విషయాన్ని పరిశీలన చేస్తే మనిషి మేధస్సు ఎటువంటి అద్భుతాలను సృష్టిస్తుందో అర్ధం అవుతుంది. ఒక లక్ష్యాన్ని సాధించాలి అని అనుకున్నప్పుడు శారీరక శ్రమతో పాటు మేధోసంపత్తి కూడ కలిసినప్పుడు మాత్రమే చేసే పని విజయవంతమై విజయం లభించి తద్వారా సంపదకు మార్గం ఏర్పడుతుంది. 

 

చాలామంది తమకు పరాజయం ఎదురైనప్పుడు అది అంతా తమ దురదృష్టం అనీ తమ పై దేవుడి దయలేదని బాధ పడుతూ ఉంటారు. అయితే ఇది అంతా మన ఆలోచనలు మాత్రమే మన ప్రయత్నంతో ఈ ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు అయితే దానికి మన మేధస్సుకు మరింత పదును పెట్టాలి. సరైన సమయం కోసం ఓపికతో సహనంగా వేచి చూడాలి. 


ప్రతి విషయాన్ని మనం ప్రయత్నిస్తూనే ఫలితాన్ని ప్రకృతికి వదిలేయాలి. ప్రకృతికి వ్యతిరేకంగా ఏవ్యక్తి పోరాటం చేయలేడని లేటెస్ట్ గా జరుగుతున్న కరోనా అనుభవాలు మనిషికి పాఠాలు నేర్పుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో నిరంతర మేధో మధనంతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆలోచనలు చేయగలిగినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుంది. ఆశక్తి ఏవ్యక్తిని అయినా సంపన్నుడుగా మార్చి తీరుతుంది. అయితే భగవంతుడుకి అన్ని వదలకూడదు మనం చేయలేని పనిని మాత్రమే భగవంతుడుకి విడిచిపెడితే అతడు మనకు సహకరిస్తాడని భగవద్గీత చెపుతోంది. దీనితో మానవ మేధస్సుల ఆలోచనల నుంచి మాత్రమే సంపద సృష్టింపబడుతుంది అన్నవిషయం అర్ధం అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: