సంపద రావాలి అంటే ఒక వ్యక్తి ఎదో ఒక వ్యాపారం చేయాలి ఆ వ్యాపారం రియలెస్టేట్ కావచ్చు లేదా సాంప్రదాయ పద్ధతులలోని వ్యాపారాలు కావచ్చు అదీ లేకుంటే ప్రస్తుతం కాలమాన పరిస్థితులలో మారిన వాతావరణంలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ చేసే వ్యాపారాలు కావచ్చు. ఇలా ఏ వ్యాపారానికైనా కొనడం అమ్మడం అన్న రెండు ప్రధాన అంశాల పై వ్యాపార విజయం ఆధారపడి ఉంటుంది.

 

ఈ రెండు విషయాలలోనూ ఒక వ్యక్తి ఎంత తెలివిగా వ్యవహరిస్తే అంత సులువుగా విజయాన్ని అందుకుని సంపదను పొందుతాడు. అమ్మడం కొనడం విషయాలలో ఒక వ్యక్తి సరైన వ్యక్తితో తాను వ్యవహరిస్తున్నాను అన్న నమ్మకం పైనే వ్యాపార విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో ‘లా ఆఫ్ ఎట్రాక్షన్’ కీలక పాత్ర వహిస్తుంది.

 

మనం వ్యాపార వ్యవహారాలు నిర్వహించే ప్రతి వ్యక్తితో సరైన బిజినెస్ చేస్తున్నాము అన్న అవగాహన రావాలి అంటే మన కొనుగోలు అమ్మకాల విషయంలో ఎంత తెలివిగా ప్రవర్తిస్తున్నాము అన్న విషయం పై ఆధారపడి ఉంటుంది. ‘సంపన్నులను కావించే మీ అనంత శక్తి’ పుస్తకాన్ని వ్రాసిన జోసఫ్ మర్ఫీ అభిప్రాయాల ప్రకారం వ్యాపారంలో విజయం సాధించడానికి మూడు అంశాలు కీలకంగా ప్రభావితం చేస్తాయి.

 

ప్రతి వ్యక్తి తన ఊహాలోకంలో తన వ్యాపార నిర్వహణల నుంచి కొంత మొత్తాన్ని బ్యాంక్ లో డిపాజిట్ చేసినట్లు ఊహించుకోవడం తన వ్యాపారంలో ఉన్న కష్టమర్లు తనను అభినందిస్తున్నట్లుగా కలలు కనడంతో పాటు ప్రతివ్యక్తికి ప్రేమతో నిండిన సేవను అందిస్తున్నాను అంటూ నిద్రపోయే ముందు ఆలోచిస్తూ నిద్రకు ఉపక్రమించే పనులకు సంబంధించిన ఈ మూడు అంశాలు ఒక వ్యక్తి చేసే వ్యాపార విజయం పై అత్యంత ప్రభావాన్ని చూపెడతాయి. వ్యాపారానికి సంబంధించి అత్యంత కీలకమైన ‘లా ఆఫ్ ఎట్రాక్షన్’ విషయంలో విజయం సాధించిన వ్యక్తి మాత్రమే తాను ఎంచుకున్న లక్ష్యాన్ని పెంచుకుని ధనవంతుడుగా మారుతాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: