ప్రాచీన కాలం నుంచి ఒక మనిషి తన రాబడిలో పదోవవంతు పుణ్యకార్యాలకు దానధర్మాలకు వినియోగించడం ఒక ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ పద్ధతి కేవలం మన హైందవ ధర్మంలోనే కాదు ఇతర ప్రముఖ మతాలు అయిన క్రిస్టియన్ ముస్లిమ్ మతాలలో కూడ కనిపిస్తుంది. నడుస్తున్న రంజాన్ మాసంలో ఎందరో ముస్లిమ్ లు పేదవారికి తమకు ఉన్న దాంట్లో దానాలు చేస్తూ తమ మంచి మనసును చాటుకుంటూ ఉంటారు.


ఈ పదోవవంతు దానం అనే విషయం జీవితానికి సంబంధించిన ప్రాధమిక నియమాలలో ఒకటి. మన సంపదలో పదోవ వంతు దానం ఇవ్వడం అంటే భగవంతుడు మనకు మరిన్నిరెట్లు సంపదను కలిగించినట్లు అని భావించడం. అలా భావించినప్పుడే ఒక వ్యక్తి సంపద మరింత పెరుగుతుంది. వేదాంత శాస్త్రంలో కూడ ఈ దశాంశ మాయాజాలానికి సంబంధించిన సూత్ర విశ్లేషణ కనిపిస్తుంది. 


ప్రపంచ విఖ్యాతి గాంచిన బిల్ గేట్స్ నుండి ఎందరో ప్రపంచ స్థాయి ధనవంతులు తమ సంపదలో పదోవ వంతుకు పైగా దానాలు ఇచ్చి ఎందరికో ఆదర్శ ప్రాయంగా మారారు. ఇలాంటి పరిస్థితులలో ఏ వ్యక్తికి ఆవ్యక్తి తనకు వచ్చే ఆదాయంలో కనీసం పదోవవంతుకు తక్కువ కాకుండా దానం చేయగల పెద్ద మనసు ఉంటే మానవ ప్రయత్నానికి భగవంతుడు అనుగ్రహం కూడ తోడై సంపద తనకు తానుగా వచ్చి చేరుతుంది అన్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. 


కేవలం ఈ దశాంశ మాయాజాల సూత్రం డబ్బుకు సంబంధించి మాత్రమే కాదు ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ప్రేమను పంచే విషయంలో కూడ సంబంధించి ఉంటుంది. ఎదుటి వ్యక్తి పై నిస్వార్ధంతో కూడిన ప్రేమను కనీసం పదోవవంతు అయినా ప్రదర్శించగలిగితే అదే నిజమైన పూజ అని ఆధ్యాత్మిక వాదులు అంటారు. ఇలా మన దగ్గర ఉన్న డబ్బును ఎదుటి వ్యక్తికి మంచి మనసుతో ఇవ్వగలిగినప్పుడు మాత్రమే మన సంపద ఎన్నోరెట్లు అధికం అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: