ఒకవ్యక్తి ఎంత కష్టపడినా రాత్రికి రాత్రి సినిమా కథలులోలా కోటీశ్వరుడు లా మారలేడు. కోటీశ్వరుడుగా మారడానికి తెలివితేటలతో పాటుగా కొన్ని టెక్నిక్స్ కూడ ఉపయోగించాలి. ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది మనీ ఎక్స్ పర్ట్స్ ఈవిషయాలకు సంబంధించి అనేక టెక్నిక్స్ ను సూచిస్తున్నారు. ఇలాంటి టెక్నిక్స్ లో స్వయంకృషితో అగ్రగామి దేశంగా ఎదిగిన జపాన్ దేశంలోని అనేకమంది అనుసరిస్తున్న కాకీబో టెక్నిక్ మనకు కూడ బాగా ఉపయోగపడుతుంది.


జపాన్‌ కు చెందిన ఫైనాన్షియల్ మేనేజ్‌ మెంట్ ఎక్స్ పర్ట్ కాకీబో ఈ టెక్నిక్ ను జపాన్ ప్రజలకు పరిచయం చేసింది. డబ్బును ఎలా మేనేజ్ చేయాలి అన్నవిషయం ఈ టెక్నిక్ లో చాల వివరంగా ఆమె వివరించింది. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టే వారు కూడ ఈ టెక్నిక్ ను అనుసరిస్తే చాలావరకు వారి దుబారాను తగ్గించుకోగలుగుతారు. కాకీబో అంటే ఇంటి జమా ఖర్చుల్ని వ్రాసే పుస్తకం అని అర్థం.


ప్రస్తుతం చాలామంది ఆన్‌ లైన్ షాపింగ్ మోజులో తమకు అవసరంలేని ఎన్నో వస్తువులను కొంటూ ఉంటారు. ఇలా కొనేవారు అంతా ఒక పెన్ పుస్తకం తీసుకుని తమకు తామే ఈ ప్రశ్నలు వేసుకోవాలి. ఈ వస్తువు లేకుండా నేను జీవించగలనా ? నా ఆర్థిక పరిస్థితులను బట్టి ఈ వస్తువు కొనగలిగే స్తోమత నాకు ఉందా ? నేను ఈ వస్తువును ఉపయోగిస్తానా? ఈ వస్తువు దాచుకోవడానికి ఇంట్లో స్థలం ఉందా ? ఆ వస్తువును నేను మొదటిసారి ఎక్కడ చూశాను ? అనే ప్రశ్నలు మనకు మనమే వేసుకోవాలి. ఈ ప్రశ్నలలో కనీసం   గుర్తుంచుకోవాలి.  4 ప్రశ్నలకు అయినా సరైన సమాధానాలు వస్తే మనం ఆ వస్తువు కొనడానికి పెట్టిన ఖర్చు సరైనది అన్న నిర్ణయానికి రావచ్చు.

ఈసూత్రం కేవలం మనం ఏదైనా వస్తువులను కొన్నప్పుడు మాత్రమే కాదు. ఎక్కడకైనా టూర్ వెళ్లాలనుకున్నా ఏదైనా ఒక గిఫ్ట్ కొనాలి అని అనుకున్నప్పుడు మనకు మనమే ఈ ప్రశ్నలు వేసుకోగలిగితే ఎవరికీ వారు మనీ ఎక్స్ పర్ట్స్ గా మారిపోవచ్చు. ఇలా పొదుపు చేసినప్పుడు మాత్రమే మన ఇంట సంపద పెరుగుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: