పేదరికం జీవితానికి సంబంధించింది కాదు అది మన భావాలకు సంబంధించింది. ఈ సృష్టి కర్త అయిన భగవంతుడు ప్రకృతిని సృష్టించింది మనుష్యులను ధనవంతులుగా మార్చడానికి మాత్రమే. ఈ అనంత విశ్వంలో ప్రకృతి మనకు ప్రసాదించిన శక్తులను సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే ఏవ్యక్తి అయినా చాల సులువుగా ధనవంతుడుగా మారగలుగుతాడు. 


అయితే ఆవాస్తవాలను గ్రహించలేక ప్రపంచంలోని మానవ జాతి తమకు తామే ప్రకృతిని తమ శత్రువుగా భావిస్తూ ఆ ప్రకృతిని నాశనం చేస్తున్న పరిస్థితులు మాన జాతికి వినాసనాన్ని కల్గించడమే కాకుండా కరోనా లాంటి ఎన్నో విపత్తులను తెచ్చి పెడుతున్న విషయాన్ని ప్రస్తుతం మనిషి అనుభవ పూర్వకంగా తెలుసుకుంటున్నాడు. వాస్తవానికి భగవంతుడు మనిషిని సృష్టించే డప్పుడు అతడికి ధనవంతుడుగా మారడానికి అవసరమైన తెలివితేటలను సమృద్ధిగా పుట్టుకతోనే ఇస్తాడు. 


అయితే పుట్టిన ప్రతి వ్యక్తి తనలో నివిడీకృతంగా ఉన్న తెలివితేటలను గుర్తించడంలో విఫలం అవుతున్నాడు. అయితే ఈ పోటీ వాతావరణంలో ఏవ్యక్తి అయితే తనలో అంతర్లీనంగా ఉన్న తెలివితేటలను మానవ సంపదను ప్రకృతి గొప్పతనాన్ని గుర్తించ గలుగుతాడో ఆ వ్యక్తి మాత్రమే ధనవంతుడుగా మారగలుగుతాడు. మనకు ఉన్న ప్రతిభను అద్భుతమైన రీతిలో సాటి చెప్పే అవకాశం దేవుడు మనకు కల్గించినా ఆ విషయాలను గుర్తించడంలో చాలామంది నిర్లక్ష్యం చేయడం వలెనే పేద వారుగా మారుతున్నారని ఆధ్యాత్మిక వేత్తలు చెపుతారు.


ప్రకృతి మనకు ప్రసాదించిన జీవిత నీమాలను గుర్తించకుండా వాటిని నిర్లక్ష్యం చేయడం వల్లనే అనేక ప్రకృతి ఉపద్రవాలు సంభవించి మనిషి ధనం సంపాదించే ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తున్నాయి. ద్వేషంతో కసి పగతో కూడిన ఆలోచనలలో ఉన్న వ్యక్తి ఎన్ని పూజలు చేసినా భగవంతుడు స్పందించడు. సంతోషం సంపద సాఫల్యం అనే మూడుసూత్రాలను జీవితాంతం అనుసరించే ఏవ్యక్తి అయినా చాల సులువుగా ధనవంతుడు కాగలడు. అందుచేత అపరమితమైన ప్రకృతి శక్తిని గుర్తించినప్పుడు మాత్రమే ఏవ్యక్తి అయినా ధనవంతుడు కాగలుగుతాడు అనే జీవిత సత్యాన్ని గుర్తించినప్పుడు మాత్రమే సంపద మన దరి చేరుతుంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: