ప్రతి వ్యక్తికి తాను ఎంచుకున్న రంగంలో అదేవిధంగా తాను చదువుతున్న చదువులో లేదంటే తాను కొనసాగుతున్న వృత్తిలో విజయం సాధించగలనా అన్న సందేహాలు వెంటాడుతూనే ఉంటాయి. ఈ అనుమానాల పై విజయం సాధించినప్పుడు మాత్రమే విజయం వచ్చి ఆ వ్యక్తికి సంపద దరి చేరుతుంది.


ఈ అనుమానాలతో కోపం విసుకు విషాదం భయం ఆందోళన మనకు తెలియకుండానే మనలో చేరిపోతు ఉంటాయి. ఈ ఎమోషన్స్ మన ప్రయత్నాలకు అడ్డు తగులుతూ అప్పటి వరకు మనం చేసిన కృషిని నీరు కారుస్తాయి. అంతేకాదు మన పట్ల మనకున్న నమ్మకాన్ని కూడ ఈ అనుమానం తగ్గించి వేస్తూ ఉంటుంది. అయితే చాలామంది అనుమానం తాను తీసుకునే జాగ్రత్త అనుకుంటారు అయితే అనుమానం వేరు జాగ్రత్త వేరు.


ఏవిషయం వైపు వెళ్ళకుండా కట్టడి చేసేది అనుమానం అయితే జాగ్రత్తలు తీసుకుంటూ ముందు అడుగు వేయమని తెలియచెప్పే విషయమే జాగ్రత్త. కొందరికి ఆరోగ్యం పట్ల మరణం పట్ల విపరీతమైన అనుమానాలు ఉంటాయి. దీనితో వారి అనుమానాలతోనే తమకు తాముగా ఏపని చేయలేని వ్యక్తులుగా చాలమంది మారిపోతు ఉంటారు. ఈ అనుమానాలు మూడు రకాలుగా విభజించ వచ్చు. ఒకటి రోజుకు ఎన్నిసార్లు ఇలాంటి అనుమానాలు మనకు కలుగుతున్నాయి అదేవిధంగా ఈ అనుమానాల సాంద్రత ఎంతవరకు మన మానసిక స్థితి పై ప్రభావితం చేస్తుంది ఈ అనుమానాలకు సంబంధించిన డ్యూరేషన్ ఎంతసేపు ఉంటుంది అన్న విషయాల పై మన అనుమానాలు ఏ సాంద్రతలో మనలను ప్రభావితం చేస్తున్నాయి అన్న విషయం అర్ధం చేసుకోవచ్చు.


ఈ అనుమానాలు వల్ల కలిగే నష్టాలను ఆందోళనలను తగ్గించుకోవడానికి ఆల్బర్ట్ ఎల్లీస్ అనే శాస్త్రవేత్త ఎ.బి.సి. థియరీ కనిపెట్టాడు. ఈ థియరీ ప్రకారం ప్రతి చర్యనీ మూడు అంశాలుగా విభజించుకుని చర్య నష్టం పరిణామం అన్న విషయాల పై క్లారిటీ రాగలిగితే ఒక వ్యక్తి తన అనుమానాల పై యుద్ధం చేసి విజయం సాధించడమే కాకుండా విజయాన్ని అందుకుని ఐశ్వర్య వంతుడుగా మారుతాడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: