ప్రభుత్వాలకు అయినా వ్యక్తులకు అయినా వ్యాపార సంస్థలకు అయినా ఎప్పుడు ఆదాయం ఖర్చులు ఈ రెండింటికి సమతూకం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఆర్ధిక విశ్లేషకులు నుండి సామాన్యుల వరకు తమ అనుభవాలతో చెప్పే మాటల ప్రకారం ఆదాయం కన్నా ఖర్చులు కనీసం 30 శాతం తక్కువ ఉండాలి. అలా ఉన్నపుడు మాత్రమే ఒక వ్యక్తి ఆర్ధిక స్థితి బ్యాలెన్స్ అవుతుంది.


ప్రస్తుత కరోనా పరిస్థితులలో మాత్రమే కాదు ఏ విపత్కర పరిస్థితులలోను ఒక వ్యక్తికి అదేవిధంగా ఒక సంస్థకు వచ్చే ఆదాయం ఏమాత్రం సరిపోదు. అందువల్లనే మారిన పరిస్థితులకు అనుగుణంగా మన జీవన శైలి మార్చుకుని మన నగదు నిలువలు పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాలి. అనవసరపు ఖర్చులు నియంత్రిస్తూ వాస్తవ పరిస్థితులలో జీవించకపోతే అది ఒక వ్యక్తికైనా ప్రభుత్వానికైనా సంక్షోభాన్ని తెచ్చి పెడుతుంది.


ముఖ్యంగా ప్రతివ్యక్తి ప్రస్తుతం ఆదాయం తగ్గిన పరిస్థితులలో నిత్యావసర వస్తువుల కోసం ఎంత డబ్బు కావాలి అన్న లెక్కలు వేసుకుంటూ ఆతరువాత వచ్చే అవసరాల కోసం తన దగ్గర అవసరమైన డబ్బు ఉందా లేదా అన్న స్పష్టమైన లెక్కలు వేసుకోవాలి. దీనికోసం ఖర్చుల ప్రాధాన్య క్రమం ఆలోచనలు చేస్తూ అనవసరం అనుకున్న చిన్న ఖర్చులను కూడ తగ్గించు కోగాలిగినప్పుడే ఒక వ్యక్తి ఇలాంటి పరిస్థితులలో విజయం సాధించగలుగుతాడు.


ఖర్చుల ప్రాధాన్యతలను గురించి ఆలోచనలు చేస్తూనే మరో నాలుగు ఐదు నెలలలో ఆదాయం మెరుగుపరుచుకునే మార్గాల కోసం అన్వేషణ సాగించాలి. అదేవిధంగా ప్రతివ్యక్తి కనీసం తనవద్ద ఆరు నెలల ఖర్చులకు సరిపడే డబ్బును అత్యవసర నిధిగా తన వద్ద ఉంచుకోకపోతే అనేక సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది. ప్రభుత్వాల నుండి వ్యక్తుల వరకు అందరు ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభం ఎదుర్కుంటున్న పరిస్థితులలో ఏవ్యక్తి అయినా తన దగ్గర ఉన్న డబ్బును సమర్ధవంతంగా నిర్వహించడం అనే కళ పైనే అతడి విజయం ఆధార ఉండి సంపద పెరుగుతుంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: