ఒక వ్యక్తి ఒక మ్యాజిక్ షోను చూస్తున్నప్పుడు అన్నీ తనకు తెలిసిన విషయాలుగానే అనిపించినా ఆ ఇంద్రజాలికుడు చేసే మ్యాజిక్ తో సమానంగా సాధారణ వ్యక్తి ఆ ట్రిక్ ను ప్లే చేయలేడు. అదేవిధంగా డబ్బు సంపాదన విషయంలో ఉన్న మార్గాలు గురించి అందరికీ తెలిసినా డబ్బు సంపాదించే సందర్భాలు ఎదురౌతున్నప్పుడు కొందరు మాత్రమే ఆ విషయంలో విజయాన్ని సాధించగలుగుతారు.


ఈ విషయాలకు సంబంధించి సంపాదనకు సంసిద్ధులు కండి అంటూ డాక్టర్. హిల్ ధన సంపాదన గురించి గతంలో ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఇప్పటికీ ఆచరణ నీయంగానే కొనసాగుతున్నాయి. ఒక ఇంద్ర జాలికుడు తన మ్యాజిక్ రహస్యాన్ని బయటపెట్టకుండా చాలతెలివిగా జనం మధ్య ఎలా తన ప్రదర్శన కొనసాగిస్తూ ఉంటాడో ధన సంపాదన విషయంలో విజయవంతమైన వ్యక్తి కూడ తన విజయ రహస్యాన్ని బయటకు చెప్పకుండా కొనసాగుతూ ఉంటాడు అని హిల్ అభిప్రాయ పడుతున్నాడు.


అందుచేతనే డబ్బు సంపాదించాలి అని ఆలోచనలు చేసే ఏవ్యక్తి అయినా కేవలం తన కోరికతో మిగిలిపోకుండా తన మేధస్సును కూడ పదును పెట్టినప్పుడు మాత్రమే సంపాదన లక్ష్యాలను నెరవేరతాయి. ఈవిషయంలో ప్రతివ్యక్తికి ఒకొక్క యాక్షన్ ప్లాన్ ఉంటుందని అందరి వ్యక్తులకు ఒకేరకమైన సంపాదన సూత్రాలు ఉండవు అంటూ హిల్ అభిప్రాయపడుతున్నాడు.


మనం డబ్బు సంపాదించాలి అన్న నిర్ణయం తీసుకున్న తరువాత దానికి ఈవిషయమై మనం చేయవలసిన కార్యాచరణ ఒక క్రమ పద్ధతిలో ఉన్నప్పుడు మాత్రమే ఏవ్యక్తి అయినా తన ఆలోచనలు క్రియా రూపం దాల్చి ధనవంతుడుగా మారగలుగుతాడు. ఈ విషయాలలో విభిన్నంగా ఆలోచిస్తూ ఒక నీటి బొట్టుతో కూడ ఒక సముద్రాన్ని సృష్టించగలం అన్న ఆలోచనలు చేయగలిగిన వ్యక్తి మాత్రమే ఐశ్వర్య వంతుడు కాగలుగుతాడు. దీనితో అన్ని సంపదలకు ఆలోచనలు మాత్రమే కీలకం అన్న విషయాన్ని గ్రహించిన వ్యక్తి మాత్రమే ఐశ్వర్య వంతుడుగా మారగలుగుతాడు అన్న విషయాన్ని అనేక సందర్భాలు తెలియచేస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: