జ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి సాధారణ జ్ఞానం రెండవది ప్రత్యేక జ్ఞానం. సాధారణ జ్ఞానం అంటే ప్రాపంచక విషయాల పై నాలెడ్జి కలిగి ఉండటం. ఈ విజ్ఞానం వల్ల ఏవ్యక్తికి ఎటువంటి గుర్తింపు కాని అదేవిధంగా ధనం కాని లభించదు. అయితే ప్రత్యేక జ్ఞానం కలిగి ఉన్న వ్యక్తులకు మాత్రమే గుర్తింపుతో పాటు ఐశ్వర్యం కూడ లభిస్తుంది.


అయితే ఈప్రయాణంలో ప్రతివ్యక్తికి అనేక ప్రతికూల పరిస్థితులు వైఫల్యాలు మనోవ్యధలు ఎదురౌతూ ఉంటాయి. దీనితో అనేక నిరాశలు నిరుత్సాహాలు మన మనసు పై దాడి చేస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులలో మన పై వ్యతిరేక ప్రభావాన్ని చూపించే ఆశను బానిసగా చేసుకోకలిగిన మనో నిబ్బరం ఉన్న వ్యక్తి మాత్రమే ధనవంతులు కాగలుగుతారు. ధనవంతుడుగా మారాలి అన్న ప్రఘాడమైన వాంఛ ఉండగానే సరిపోదు దీనికి సరిపోయే జ్ఞానాన్ని కూడ మనం అలవరుచుకోవాలి.


ప్రపంచంలో సంపన్న వ్యక్తులుగా పేరు గాంచిన వారు అంతా ఎదో ఒక రంగంలో ప్రత్యేకమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నవారు మాత్రమే. థామస్ ఆల్వా ఎడిసెన్ తన జీవితంలో మూడు నెలలు మాత్రమే స్కూల్ కు వెళ్ళాడు అన్న విషయం తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్య పడతారు. అయితే విజ్ఞానం పట్ల ముఖ్యంగా సైన్స్ పట్ల అతడికి ఉన్న మక్కువతో ప్రపంచ విఖ్యాత శాస్త్రవేత్తగా ఎదిగాడు.


ప్రతి వ్యక్తికి ఎదో ఒక రంగంలో అభిరుచి ఉంటుంది. అయితే ఆ అభిరుచిని తనకు తాను గుర్తించుకోలేక చాలామంది రొటీన్ జీవితానికి అలవాటు పడిపోతూ ఉంటారు. దీనికితోడు వ్యతిరేక పరిస్థితులతో ముఖ్యంగా నిరాశతో యుద్ధం చేయాలి అంటే ఒక వ్యక్తికి పట్టుదలతో పాటు శిక్షణ కూడ చాల అవసరం. ఈ విషయాలను చాలామంది గ్రహించకుండానే తమలోని ప్రతిభా విశేషాలను తమతోపాటే సమాధి చేసుకుంటూ ఉంటారు. ప్రతి వ్యక్తికి ఎదగాలనే కోరిక ఉంటే తన తీరిక సమయంలో విజేతలకు సంబంధించిన జీవిత విశేషాలను తెలుసుకోవడం ఒక అలవాటుగా చేసుకుంటే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా నిరాశను పారద్రోలి ఆశ ను బానిసగా చేసుకుని ఏ విషయంలో అయినా విజయాన్ని సాధించి ఐశ్వర్య వంతుడు అవ్వడం ఖాయం..  

మరింత సమాచారం తెలుసుకోండి: