ప్రతివ్యక్తి ఎదో ఒక పని చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అయితే ఒకే ఒక పని చేస్తూ జీవనం సాగించే వ్యక్తి ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ ఆ వ్యక్తి ధనవంతుడు కాలేడు. అయితే అలాంటి వ్యక్తులు వారి జీవితాలలో డబ్బు సంపాదనకు సంబంధించి త్రీ ఇన్ వన్ పాలసీని అనుసరించినప్పుడు మాత్రమే ధనవంతులు కాగలుగుతారని మనీ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.


ఇక ఈ త్రీ ఇన్ వన్ పాలసీ వివరాలలోకి వెళ్ళి మనకు అర్థం అవ్వాలి అంటే ఒక ఇంగ్లీష్ లెక్చర్ జీవితాన్ని నిశితంగా పరిశీలించినప్పుడు మాత్రమే మనకు అర్ధం అవుతుంది. ఉదాహరణకు రావ్ అనే ఇంగ్లీష్ లెక్చరర్ ఒక కాలేజీలో పనిచేస్తున్నప్పుడు అతడి కాలేజీ పని మధ్యానం వంటి గంటకు అయిపోతుంది. అయితే ఇంటికి వచ్చిన తరువాత అతనికి నెలకు వచ్చే 25 వేల జీతంతో సంతృప్తి పడకుండా అతడు స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ మీద పుస్తకాలు వ్రాయడం మొదలు పెట్టి ఆ పుస్తకాల ద్వారా తనకు పారితోషికం వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నాడు.


ఆతరువాత ప్రతిరోజు సాయంత్రం ఒక గంటసేపు ట్యూషన్స్ చెప్పడం పనిగా కూడ పెట్టుకుని మరొక విధంగా అదనపు ఆదాయాన్ని ఏర్పరుచు కోవడానికి ప్రయత్నించాడు. ఇలా ఒకే సమయంలో మూడు పనులు చేయడం ద్వారా అతడికి అదనపు ఆదాయం ఏర్పడి అతడి పొదుపు ఖాతా కూడ బాగా పెరిగింది. ఇలా మూడు పద్ధతులను ఏక కాలంలో పాటించడం వల్ల ఆ ఇంగ్లీష్ లెక్చరర్ చాల తొందరలో ఆర్ధిక స్వేచ్చ ఏర్పడింది.


ఇలా అతడు ప్రవర్తించిన విధానాన్ని త్రీ ఇన్ వన్ పాలసీ అంటారు. అయితే ఇలా అందరికీ మూడు పద్ధతులు అనుసరించే అవకాశాలు వీలు కుదరకపోవచ్చు. అయితే తమకు ఉన్న పరిదిలో ఎవరికీ వారు ఈ త్రీ ఇన్ వన్ పాలసీ ని అనుసరిస్తూ ప్రయత్నించినప్పుడు మాత్రమే ఆర్ధిక స్వేచ్చ ఏర్పడి ధనవంతులుగా మారే ఆస్కారం ఉంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: