‘మీరు ఏమి చేయాలని అనుకుంటున్నారో ప్రపంచానికి చెప్పండి. దానిని మాటలలో కాకుండా చేతలలో చేసి చూపించండి’ అని ప్రపంచ విఖ్యాత మనీ విశ్లేషకుడు డాక్టర్. హిల్ అనేకసార్లు తన ఉపన్యాసాలలో చెపుతూ ఉంటాడు. అందువల్లనే మన పెద్ద వాళ్ళు కూడ మాటలకన్నా చేతలు మిన్నఅన్న సామెతను చెపుతూ ఉంటారు. 


మనలో చాలమంది తమ అవసరాలకు సరిపడే డబ్బును సంపాదించే విషయంలో చాల సార్లు విఫలం అవుతూ ఉంటారు. ఇలా చాలమంది విఫలం కావడానికి ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఇవ్వడమే ప్రధాన కారణం. మనలో చాల మంది వార్తా పత్రికలలో వచ్చే వార్తలు అదేవిధంగా సోషల్ మీడియాలో చాలమంది చేసే కామెంట్స్ ఇరుగుపోరుగు వారు వెల్లడించే అభిప్రాయాలకు విలువ ఇస్తూ తమ అభిప్రాయాలను మరుగున పరుచుకుంటూ ఉంటారు.


అందుకే భూమి మీద అతి చవకగా దొరికే వస్తువు ఇతరుల అభిప్రాయాలు మాత్రమే అని చెపుతూ ఉంటారు. ఇలా ఇతరుల అభిప్రాయాలను అదేవిధంగా వారి నిర్ణయాలను విపరీతంగా పరిగణలోకి తీసుకుంటూ ఆలోచనలు చేస్తూ వ్యాపారాలు చేసే ఏ వ్యక్తి రాణించలేడు. అన్ని వ్యాపారాలు ఒకలా కనిపించినా ఏ వ్యాపారానికి సంబంధించి ఆ వ్యాపారానికి సంబంధించిన కొన్ని రహస్యాలను తెలుసుకోవడంలోనే నిజమైన మేధస్సు ఉంటుందని మనీ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడుతూ ఉంటారు. 


అందువల్ల ఇతరుల అభిప్రాయాలకు ప్రభావితం కాకుండా మనకు మనమే సలహాదారులుగా మారినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి తాను ఎంచుకున్న వ్యాపారంలో కాని ఉద్యోగంలో కాని రాణించ గలుగుతాడని అనేక అధ్యయనాలు చెపుతున్నాయి. వాస్తవానికి మన ప్రాణ స్నేహితులు మన బంధువులు మనపట్ల వారికి ఉన్న అభిమానంతో వారి సలహాలతో మనలను ప్రభావితం చేస్తూ ఉంటారు. అయితే ఆసలహాలు ఎంతవరకు మనకు ఉపయోగ పడతాయో తెలుసుకోకుండా మనం నిర్ణయాలు తీసుకుంటే అనేకరకాల అపజయాలు ఎదుర్కోవలసి వస్తుంది. దీనితో మన వృత్తికి వ్యాపారానికి లేదా ఉద్యోగానికి సంబంధించిన ప్రణాళికలలో మాటల కంటే చేతలకు ఎక్కువ విలువ ఇస్తూ అడుగులు వేసినప్పుడు మాత్రమే సంపన్నుడు కాగలడు..  

మరింత సమాచారం తెలుసుకోండి: