ప్రపంచంలో అందరి సుఖ శాంతుల కోసం డబ్బు చాల అవసరం. అయితే ఈ డబ్బులో రెండు రకాలు ఉంటాయి. అందులో ఒకటి ఆనందకరమైన డబ్బు అయితే రెండవది దుఃఖంతో కూడుకున్న డబ్బు. ఒకవ్యక్తి అను నిత్యం ఆనందంతో చైతన్య వంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఎలా విజయం సాధిస్తాడో అతడి దగ్గర ఉన్న డబ్బును కూడ అను నిత్యం ఆనందంతో చైతన్యవంతంగా ఉంచి నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి దగ్గర ఉన్న డబ్బు వృద్ధి చెందుతుందని జపాన్ ప్రజల ‘హ్యాపీ మనీ సిద్దాంతం’.


ఈ సిద్దాంతంలో మన దగ్గర ఉన్న డబ్బు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలని భావిస్తూ ఉంటారు. వాస్తవానికి జీవం లేకుండా కాగితాల రూపంలో ఉండే డబ్బు ఎలా నవ్వుతుంది అన్న ఆలోచన చాల మందికి వస్తుంది. అయితే ఏవ్యక్తి అయితే ఎల్లప్పుడూ నవ్వుతు ఆనందమయంగా ఉంటాడో ఆ వ్యక్తి చైతన్యం అతడి దగ్గర ఉన్న డబ్బుకు కూడ తాకి ఆ డబ్బు చైతన్యం పొంది మరింత వృద్ధి చెందుతుంది.


మనిషి చుట్టూ ఎలా అయితే ఎనర్జీ ఉంటుందో అలాగే ఒక వ్యక్తి డబ్బు పెట్టుకునే పర్స్ కు నిరంతరం ఎనర్జీ లెవెల్స్ తాకే విధంగా ఉన్నప్పుడు మాత్రమే మన పర్స్ లోని డబ్బు చైతన్యం పొంది అభివృద్ధి చెందుతుందని కొందరి అభిప్రాయం. అంతేకాదు డబ్బును ఒక కాగితపు వస్తులా కాకుండా నిరంతరం చైతన్యంగల సాధనా శక్తి లా చూసినప్పుడు మాత్రమే ఒకవ్యక్తి ఎప్పటికైనా బిలియనీర్ కాగలడు అనీ ప్రముఖ మనీ ఎక్స్ పర్ట్ కెన్ హోండా అభిప్రాయపడుతున్నాడు.


మన దగ్గర ఉన్న డబ్బులో కొంత భాగం ఒక పేదవాడి కుటుంబానికి సాయం చేసినప్పుడు ఆ పేదవాడి కుటుంబం మన పట్ల చూపించే కృతజ్ఞతా భావన పాజిటివ్ తరంగాలులా మారి అది మన మనీ వేలెట్ కు తాకుతుందనీ తద్వారా మన దగ్గర ఉన్న డబ్బు కూడ ఆనంద పడుతుందని కెన్ హోండా అభిప్రాయం. ఇలా మనం మాత్రమే కాదు మన దగ్గర ఉన్న డబ్బు ఆనందంగా ఉంచగలగాలి అప్పుడే సంపన్న వంతుడు కాగలడు..  

మరింత సమాచారం తెలుసుకోండి: