కరోనా పరిస్థితులు తరువాత అన్ని విషయాలలోను సమస్యలు ఏర్పడటంతో ఆ సమస్యలు అన్నీ మనుషుల ఆర్ధిక జీవితం పై ప్రభావం చూపెత్తబోతున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో 10 వేలు సంపాదించే ఉద్యోగి దగ్గర నుండి లక్షలలో ఆదాయం ఉన్నవారు వరకు ఈ కరోనా సమస్యలతో రేపు ఎలా ఉండబోతోంది అన్న భయాలలో కాలం గడుపుతున్నారు.


ప్రస్తుత పరిస్థితులలో ప్రతి వ్యక్తికి వారివారి ఆర్ధిక స్థితుల రీత్యా కష్టాలు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఈ కష్టాల నుండి గట్టెక్కాలి అంటే కనీసం ప్రతివ్యక్తి సంపాదనలో 10 శాతం డబ్బును పొడుపు చేసి తీరాలి అనీ మనీ ఎక్స్ పర్ట్స్ చెపుతున్నారు. అంతేకాదు మనకు వచ్చే ఆదాయం 100 రూపాయలు అనుకుంటే దానిని 90 రూపాయల మాత్రంగానే పరిగణిస్తూ మన ఖర్చులను ప్లాన్ చేసుకోవాలని మనీ ఎక్స్ పర్ట్స్ అబిప్రాయపడుతున్నారు.

 

ఇలాంటి పరిస్థితులలో ఎంత సంపాదన ఉన్న వ్యక్తికి అయినా ఖర్చుల పై అదుపు లేకపోతే తిప్పలు తప్పవు అన్న మాటలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మన సంపదన మన సంపాదనలో ఉండదు మనం చేసే పొదుపులోనే ఉంటుంది. ప్రపంచంలోని కోటీశ్వరులకు కూడ అన్ని కోరికలు తీరవు అన్న వాస్తవాన్ని గ్రహించ గలిగితే నేడు కరోనా సమస్యల మధ్య ఆర్ధిక సమస్యలతో సతమతమైపోతున్న సామాన్యుడు ఎలాంటి నిరాశకు లోనుకాడు.

దీనితో ప్రస్తుతం మనం ఖర్చుపెట్టే ప్రతి రూపాయికి సమానమైన విలువ వచ్చే విధంగా మన ప్లానింగ్ ఉండాలి. అయితే ఎంత తక్కువ ఆదాయం ఉన్నా ఆదాయం తక్కువగా ఉంది అని బాధ పడకుండా ఖచ్చితంగా తనకు వస్తున్న ఆదాయంలో 10 శాతం పొదుపు చేయగల సమర్ధత ఉన్నవారు మాత్రమే ఈ విపత్కర పరిస్థితుల నుండి బయటపడగాలుగుతారు. దీనితో ఎవరికీ వారే ఒక మనీ ఎక్స్ పర్ట్ గా మారిపోయి ప్రస్తుత విపత్కర పరిస్థితులను చక్కదిద్దుకోవలసిన పరిస్థితులు అందరి పైనా ఉన్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: