ఒక సమస్యకు సంబంధించిన పరిష్కారంలో మనం భాగస్వాములు కాకుండా ఆ సమస్య నుండి దూరం జరిగితే ఎంత ప్రయత్నించినా ఒక వ్యక్తి ధనవంతుడు కాలేడు అన్న విషయం ‘యుకెన్ విన్’ అన్న పుస్తకంలో శివ్ ఖేరా వివరించాడు. ఈపుస్తకాన్ని ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఇప్పటికే చదివారు.


ఈ విషయాలు కేవలం ఒక వ్యక్తిత్వ వికాసానికి మాత్రమే కాదు అతడి సంపాదనా శక్తిని ప్రభావితం చేసే శక్తిగా కూడ పరిగణించ వలసి ఉంటుంది. ప్రతివ్యక్తి వారి జీవితాలలో వారివారి స్థాయిలలో ఎదో ఒక సమస్యను ఎదుర్కుంటూనే ఉంటాడు. వాస్తవానికి సమస్యలు లేని మనిషి ఉండడు. అందువల్లనే ఒక సమస్య గురించి భయపడేకంటే ఆసమస్య పరిష్కారానికి మార్గాలు వెతికినప్పుడే ధైర్యం ఏర్పడి సమస్యతో పోరాటం చేసే శక్తి రావడమే కాకుండా ఆ సమస్యను జయించిన ఆత్మ విశ్వాసంతో ఒక వ్యక్తి తాను ఎంచుకున్న రంగంలో విజయాన్ని సాధించి ఆతరువాత సంపన్నుడుగా మారగలుగుతాడు.  


ఈ సందర్భంలో ఒక వ్యక్తి తనకు డబ్బు అవసరం అని గ్రహించడం మాత్రమే కాకుండా తనకు ఎంత డబ్బు కావాలి ఆ డబ్బును ఎన్ని సంవత్సరాల లోపు సమకూర్చుకోగలగాలి అన్న విషయంలో కూడ స్పష్టమైన యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఈ యాక్షన్ ప్లాన్ లో ఎంత క్లారిటీ ఉంటే అంత సులువుగా ఒక వ్యక్తి ధనవంతుడు కాగలుగుతాడు.


అయితే ఈ పోరాటంలో అనేక అడ్డంకులు ఎదురౌతు మన మానసిక స్థైర్యాన్ని దెబ్బకొడుతూ ఉంటాయి. ఈ విషయాలను పట్టించుకోకుండా ఒకమనిషి డబ్బు సంపాదన విషయమై అడుగులు వేయడంలో ఒక స్పష్టమైన వ్యూహాన్ని అనుసరించవలసి వస్తుంది. డబ్బు పెరుగుదల కేవలం మన సంపాదన పై మాత్రమే కాకుండా ఆ డబ్బును ఎంత తెలివిగా జాగ్రత్త పరుచుకోగలిగాము అన్న విషయమై కూడ ఆధారపడి ఉంటుందని మనీ ఎక్స్ పర్ట్ కెన్ హోండా అభిప్రాయపడుతున్నాడు. సమస్యకు పరిష్కారం వెతకడంలోనే మన సంపద సీక్రెట్ దాగి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: