ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతూ ఉండటంతో వ్యాపారాలు అతలాకుతలం అవుతున్న పరిస్థితులలో ఏ రంగం పై పెట్టుబడి పెడితే మన పెట్టుబడికి కనీసపు బధ్రతతో పాటు ఆదాయాలు వస్తాయి అన్న ఆలోచనలు సగటు వ్యక్తికి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఒక ప్రముఖ ఆర్ధిక సంస్థ సుమారు మూడువేల మందితో చేసిన సర్వేలో ప్రస్తుత పరిస్థితులలో ఏవ్యక్తి అయినా తమ పెట్టుబడులను శాస్త్రీయంగా ఈవిధంగా విభజించుకోగాలిగితే కరోనా సమయంలో కూడ ఆదాయాలకు ఎటువంటిలోటు ఉండదు అన్న విషయాలను ఆసర్వే బయట పెట్టింది.


ప్రస్తుత ఆర్ధిక పరిస్థితి మందగమనం మరొక ఏడాది కొనసాగే నేపధ్యంలో ప్రస్తుతం ఎవరైనా ఇళ్ళ పై పెట్టుబడులు పెట్టాలి అంటే పూర్తిగా నిర్మాణం పూర్తి అయిన కొత్త ఇంటిని కొనుక్కున్న వారికి రానున్న రెండు మూడు సంవత్సరాలలో తమ పెట్టుబడికి తగ్గ లాభాలు వస్తాయని ఆ సర్వే పేర్కొంది. అదేవిధంగా చిన్నచిన్న స్థలాలను కూడ ఈ కరోనా సమయంలో కొనుక్కోవచ్చు అనీ రానున్న రెండు సంవత్సరాలలో చిన్నచిన్న స్థలాల పై పెట్టుబడి పెట్టిన వారి పెట్టుబడి రానున్న మూడు సంవత్సరాలలో రెట్టింపు అయ్యే ఆస్కారం ఉంది అని ఆ సర్వే అభిప్రాయపడుతోంది.


ప్రస్తుతం షేర్ మార్కెట్ ఒడుదుడుకులు లోనవుతున్న పరిస్థితులలో ఏవ్యక్తి అయినా తన వద్ద ఉన్న పొదుపు మొత్తాలలో కేవలం 16 శాతం మాత్రమే షేర్స్ లో పెట్టుబడి పెట్టాలని అంతకు మించి పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు అన్న సలహాలు ఈ సర్వే ఇస్తోంది. ఇక బంగారంలో 28 శాతం ఫిక్సెడ్ డిపాజిట్లలలో 22 శాతం మించకుండా ఒక వ్యక్తి తన వద్ద ఉన్న పొదుపు మొత్తాలను ఇలా ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఈ నాలుగు మార్గాల పై తెలివిగా పెట్టుబడుడులు పెడితే ఇలాంటి కరోనా వ్యతిరేక ఆర్ధిక పరిస్థితులలో కూడ ఒక వ్యక్తి సులువుగా సంపన్నుడు కాగలుగుతాడు..  

మరింత సమాచారం తెలుసుకోండి: