ప్రతివ్యక్తికి డబ్బు సంపాదించాలి అన్నకోరిక ఉంటుంది తన కోరికను నెరవేర్చు కోవడానికి ప్రతివ్యక్తి తమతమ స్థాయిలలో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే వారికి తెలియకుండానే వారిలో ఉన్న కొన్ని నెగిటివ్ శక్తులు ఆప్రయత్నాలకు అడ్డు తగులుతూ ఉంటాయి. ఎంతటి గొప్ప వ్యక్తికైనా అతడి కెరియర్ కు సంబంధించి భయాలు టెన్షన్స్ అతడిని వెంటాడుతూనే ఉంటాయి. 


ఒక మనిషి ఆలోచనలను ప్రభావితం చేయడమే కాకుండా అతడికి ఉన్న భయం టెన్షన్ ఒక వ్యక్తి లక్ష్యాలను పూర్తిగా దెబ్బ తీస్తుంది. దీనితో ధన సంపాదనకు మొదటి శత్రువు భయం మాత్రమే. అదేవిధంగా ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ కోపానికి దూరంగా ఉండలేడు. అయితే మితిమీరిన కోపం ఒక వ్యక్తి విజయా అవకాశాలను దెబ్బతీయడమే కాకుండా ఆ వ్యక్తిని ధనవంతుడు కాకుండా ఈ నెగిటివ్ లక్షణాలు అతడి ప్రయత్నాలు అన్నింటికి అడ్డు తగులుతూనే ఉంటాయి.


అదేవిధంగా ద్వేషం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ ఎదో ఒక సందర్భంలో మనిషి సహజ లక్షణమైన ఈ ద్వేషం ప్రభావంలోకి వెళ్ళిపోతాడు. ఈ మితిమీరిన ద్వేషం వలన మనకు తెలియకుండానే నిరాశా నిస్పృహలు మనలో ఏర్పడి మన సమర్థతకు అడ్డు గోడలుగా నిలుస్తాయి. ఈ లక్షణం కూడ ఒక వ్యక్తి ధన సంపాదనకు అడ్డుగా మారుతుందని మనీ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.


ఇక చివరగా పేర్కొనవలసినది ఆత్మన్యూనతా భావం. ఎదో ఒక సందర్భంలో ప్రతివ్యక్తి ఈ ఆత్మన్యూనతా భావం బారిన పడతాడు. ఒకొక్కసారి మనకు తెలియకుండానే మనకు ఏర్పడ్డ ఈ ఆత్మన్యూనతా భావం మన అవకాశాలను దెబ్బ తీయడమే కాకుండా మనలను నలుగురులో కలవనీయకుండా అడ్డు గోడగా నిలుస్తుంది. మనిషి ఎదుగుదలకు అన్ని రకాలుగా అడ్డు తగిలే ఈ లక్షణాల నుండి బయటపడినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి సంపన్నుడుగా మారగలుగుతాడు. అయితే ఈ లక్షణాల నుండి బయటపడటం పుస్తకాలు చదివినంత సులువు కాదు దీనికోసం చాల ఓర్పు ప్రదర్శించాలి అందుకే ఓర్పు ఎవరిలో ఉంటుందో వారి దగ్గర సంపద ఉంటుంది అని అంటారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: