ప్రస్థుతం దేశం యావత్తు కరోనా తో విలవిలలాడుతున్న పరిస్థితులలో రోజురోజుకు పెరిగిపోతున్న కేసుల సంఖ్య త్వరలో భారత్ ను ఈ కేసుల విషయంలో అగ్రస్థానంలోకి తీసుకువెళ్ళిపోయే ఆస్కారం ఉంది అన్న హెచ్చరికలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో కరోనా భయంతో ప్రజల అలవాట్లలలో విపరీతమైన మార్పులు వచ్చాయి.


ఇప్పుడు ఈ కొత్త అలవాట్లు అనేక కొత్త వ్యాపారాలకు అవకాశం కల్పిస్తూ ఉండటంతో అనేక ప్రముఖ వ్యాపార సంస్థలు కూడ ఈకొత్త వ్యాపార అవకాశాల పై దృష్టి పెడుతున్నాయి. ప్రస్తుతం ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితులలో ఒకసారి మాత్రమే వాడి పడేసే వస్తువులకు ఆదరణ పెరుగుతోంది. శానిటైజర్లలో రకరకాల ఫ్లావర్స్ తో అనేక ప్రొడక్ట్స్ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న పరిస్థితులలో వినియోగదార్లు ఈ శానిటైజర్లలో రకరకాల ఫ్లావర్స్ తో ఉండే ప్రొడక్ట్స్ ను తమ అభిరుచికి తగినట్లు కొంటున్నారు.


ప్రస్తుత పరిస్థితులలో జనం హోటల్స్ కు వెళ్ళే పరిస్థితులలో జనం రకరకాల సూపులు బిస్కెట్లు టీలు నూడిల్స్ నమ్ కీన్స్ లాంటి పదార్ధాలతో పాటు రకరకాల పళ్ళతో తయారు అయ్యే పానీయాలను ఆన్ లైన్ లో కొనుగోలు చేసే పరిస్థితులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో పైన పేర్కున్న ప్రొడక్ట్స్ ను మరింత రుచికరంగా చవకగా తయారు చేయడానికి కంపెనీలు తమ రిసర్చ్ టీమ్ ను మారుస్తున్నాయి.


ఇక ఇది చాలదు అన్నట్లుగా కరోనా భయంతో ఆరోగ్యం పరిశుభ్రత పై జనం దృష్టి పెరగడంతో ముఖ్యంగా ఎగువ మధ్య తరగతి సంపన్నుల కుటుంబాలలోని మహిళలు ఇంటిలోని వంట గదిలో సామాగ్రిని గృహోపకరణాలలో ఇస్త్రీ పెట్టెలు రైస్ కుక్కర్లు ఫ్యాన్స్ లాంటి ఎక్కువగా కొంటూ ఉండటంతో ఈ వస్తువులకు పెరిగిన డిమాండ్ ను చూసి ఆశ్చర్య పోతున్నట్లు బెస్ట్ ప్రైస్ సీఈఓ సమీర్ అగ్రవాల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అంటే ప్రజల కొనుగోళ్ళ ధోరణి ఎంత మారిపోయిందో అర్థం అవుతోంది. ప్రస్తుతం పెరిగిపోయిన ఈ కరోనా భయాలతో చిన్నచిన్న పల్లెలలో కూడ మాస్క్ లు శానిటైజర్ల అమ్మకం పెరిగిపోవడంతో ఈ రెండిటి తయారీ ఒక కుటీర పరిశ్రమలుగా మారిపోయి దేశవ్యాప్తంగా అనేక కుటీర పరిశ్రమలు ఈ కరోనా సమయంలో వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పడం బట్టి ఆర్ధిక వ్యవస్థ ఈవిధంగా అభివృద్ధి చెందుతూ మారుతున్న ధోరణికి అద్దంగా నిలుస్తోంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: