సక్రమ మార్గంలో న్యాయబద్ధంగా డబ్బు సంపాదించడం అంత సులువైన పని అయి ఉంటే ఈదేశంలో పేద వారికంటే ధనవంతుల సంఖ్య చాల హెచ్చుగా ఉండేది. అయితే డబ్బు సంపాదించడం అంత సులువు అయి ఉంటే ఈ ప్రపంచంలో పేదరికం అన్నది మచ్చుకైనా మిగిలి ఉండేది కాదు.


డబ్బు సంపాదన ఒక మిష్టరీ లా ఎవరికీ అర్ధంకాని ఒక సైన్స్ లా మారిపోయింది. అయితే డబ్బు సంపాదన విషయంలో చాలామంది ఫెయిల్ అవ్వడానికి గల కారణం డబ్బు సంపాదనను ఒక గేమ్ లా ఆలోచించకపోవడమే అని విశ్లేషకుల అభిప్రాయం. ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఎంత తెలివిగా ఆడుతూ ఎదుటి ప్రత్యర్ధి ఎత్తుగడలను ముందుగా ఊహించుకుని అడుగులు వేస్తారో అలాగే డబ్బు సంపాదన విషయంలో కూడ ఒక వ్యక్తి ఈసంపాదనను ఒక గేమ్ లా భావించాలి కాని టెన్షన్ పడితే డబ్బు సంపాదన ముందుకు వెళ్ళదు అని ప్రముఖ మనీ ఎక్స్ పర్ట్ కెన్ హోండా అభిప్రాయం.


వాస్తవానికి ఈ డబ్బు సంపాదనలో అనేక భావోద్వేగాలు పరాజయాలు అనేక ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఆట మధ్యలో ఆటగాడికి గాయం అయినా ఎలా పట్టించుకోడో డబ్బు సంపాదన పై దృష్టి పెట్టిన వ్యక్తి కూడ ఈవిషయాల పై పట్టువీడకుండా ఉండాలి. ఏ ఆటలోనైనా గెలుపు ఓటమిలను నిర్ణయించేది ‘ఛాన్స్’ అనే కార్డ్.


అదే కార్డ్ డబ్బు సంపాదన విషయంలో కూడ ఒక వ్యక్తి చాలతెలివిగా ఉపయోగించగలగాలి. ఈ ఛాన్స్ కార్డ్ ను ఉపయోగించడంలో నైపుణ్యం లేని చాలామంది ఈ డబ్బు సంపాదనలో విజయానికి దూరం అవుతున్నారు అన్నది వాస్తవం. దీనికితోడు డబ్బును ఒక విలాస వస్తువులా కాకుండా ఒక ఎనర్జీ డ్రింక్ లా మనం వాడగలిగినప్పుడు మాత్రమే ఈ మనీ గేమ్ లో విజయం లభించి మన ప్రయత్నాలు విజయవంతం అయి ధనవంతులుగా అవుతారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: