చైనా కు చెందిన 59 యాప్ ల నిషేధం తరువాత ఒక్కసారిగా భారతీయ యాప్ లకు జై కొడుతూ మనదేశంలోని అనేకమంది మన ఇండియన్ యాప్ ల వైపు దృష్టి సాధించడంతో ప్రస్తుతం మొబైల్ యాప్స్ మార్కెట్లో నాల్గవ స్థానానికి భారత్ చేరుకొని మన సత్తాను చాటుతోంది. బెంగుళూరుకు చెందిన కొందరు టెకీలు డెవలప్ చేసిన ‘షేర్ ఛాట్’ కు గంటకు 5 లక్షల డౌన్ లోడ్స్ నమోదు చేసుకుంటూ ఈ యాప్ కు అతి తక్కువ కాలంలో 15 కోట్లమంది యూజర్లు ఏర్పడటంతో ప్రస్తుతం ఈవార్త మొబైల్ రంగంలో హాట్ టాపిక్ గా మారడమే కాకుండా ఈ యాప్ కు వస్తున్న ఆదాయాన్ని చూసి అందరు షాక్ అవుతున్నారు.


టిక్ టాక్ కు ప్రత్యామ్నాయంగా వచ్చిన రోపోసో చింగారీలకు కూడ విపరీతమైన డిమాండ్ ఏర్పడి చింగారీ యాప్ ను గంటకు మూడు లక్షలమంది డౌన్ లోడ్ చేసుకోవడం ఇప్పుడు కార్పోరేట్ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. మహేంద్రా గ్రూప్ కు చెందిన గోసోషల్ యాప్ లేటెస్ట్ గా డౌన్ లోడ్స్ 20 శాతం పెరుగుదల నమోదు  చేసుకోవడంతో పాటు మన భారతీయలు క్రియేట్ చేసిన హ్యాప్ ర్యాంప్ ట్రెల్ తదితర యాప్ లకు కూడ డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం ఈ యాప్ లను క్రియేట్ చేసిన కంపెనీలకు కాసుల వర్షం కురిపిస్తోంది.


లేటెస్ట్ గా మన ఇండియాలో లాంచ్ అయిన ఎలిమెంట్స్ యాప్ ను ఆవిష్కరిస్తూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నమాటలు స్ఫూర్తిదాయకంగా మారాయి. అనుసరణలు లేకుండా మనకు మనమే కొత్త ఆవిష్కరణలు చేసుకోగలిగితే మన భారత్ ప్రపంచానికి అగ్రగామిగా మారుతుంది అన్నమాటలు ఎవరికైనా ఉత్తేజాన్ని కల్గిస్తాయి. కరోనా పరిస్థితులలో ఇలా ఎన్నో నూతన అవిష్కరణాలు రాబోతున్నాయి అన్న సంకేతాలు రావడంతో ప్రస్తుతం యువ పారిశ్రామిక వేత్తలు మన దేశంలో కొత్త ఆలోచనలు చేయడానికి శ్రీకారం చుడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: