క్రీస్తు పూర్వం క్రీస్తు తరువాత అని చరిత్రకారులు లెక్కలు చెప్పేవిధంగా ఇప్పుడు పరిస్థితులు అన్నీ కరోనా ముందు కరోనా తరువాత అన్నట్లుగా మారిపోతున్నాయి. వ్యాపారాల దగ్గర నుండి ప్రజల జీవనశైలి వరకు కరోనా అందరిలోనూ ఎన్నోమార్పులు తీసుకు వచ్చింది. ఇలాంటి పరిస్థితులలో కరోనా కారణంగా దెబ్బతిన్న అనేక పరిశ్రమలు వ్యాపారాలు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి.


ప్రస్తుత పరిస్థితులలో కార్పోరేట్ కంపెనీల నుండి అతిసామాన్యుడు వరకు తమ ఖర్చులను తగ్గించుకుంటున్న పరిస్థితులలో ప్రస్తుతం కొన్ని కంపెనీలు అనుసరిస్తున్న ‘వర్క్ ఫ్రమ్ హోటల్’ కాన్సెప్ట్ కు కార్పోరేట్ రంగాల నుండి మంచి స్పందన వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు చాల కంపెనీలు అనుసరిస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి ప్రత్యామ్నాయంగా ఈకొత్త కాన్సెప్ట్ పాపులర్ అవుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.  


పలు కార్పోరేట్ కంపెనీలలో సీనియర్ ఉద్యోగులుగా ఉన్నవారిని పలు త్రీస్టార్ ఫైవ్స్టార్ హోటళ్లలో ఉంచి పనిచేయించే ఒక కొత్త విధానాన్ని ప్రస్తుతం కొన్ని కంపెనీలు అమలుచేస్తున్నాయి. ఈవిధానంలో
ఇప్పటికే వైరస్ ప్రభావంతో తీవ్రనష్టాలలో ఉన్న హోటల్స్  లోని కొన్ని ఫ్లోర్స్ ను కార్పొరేట్ కంపెనీల అవసరాలకు తగ్గట్లుగా వీడియో కాన్ఫరెన్స్ బోర్డు మీటింగ్ లు నూతన ప్రాజెక్ట్ ల మీటింగ్స్ నిర్వహణకు వీలుగా హోటళ్లల్లో మార్పులు చేస్తున్నాయి.


వారి అవసరాలకు అనుగుణంగా వైఫై ప్రింటర్ వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాలతోపాటు రుచికరంగా ఉండే స్నాక్స్ బేవరేజెస్ ను అందిస్తూ ఆయా హోటళ్లలో పనిచేసే ఉద్యోగులు అతిథుల మధ్య విధిగా భౌతికదూరం ఉండేలా చూస్తూ ఎప్పటికప్పుడు శానిటైజేషన్ థర్మల్ స్క్రీనింగ్ వంటి పద్ధతులతో హోటల్స్ కార్పోరేట్ కంపెనీలకు సేవలు అందించడానికి రోజులు గంటలు నెలల చొప్పున లక్ష నుంచి 25 లక్షల వరకు వేర్వేరు ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈతరహా పద్ధతిలో అనేకప్రముఖ హోటల్స్ కార్పోరేట్ కంపెనీలకు సేవలు అందించడానికి సిద్ధం అవుతున్నాయి అన్నవార్తలు కార్పోరేట్ రంగంలో ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. ఈ కరోనా సమయంలో డబ్బులు సంపాదించే కొత్త మార్గాన్ని హోటల్ ఇండస్ట్రీ అన్వేషించింది అనుకోవాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: