ప్రస్థుతం అనుకూల వాతావరణం లేకపోవడంతో అనేక మల్టీ నేషనల్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూ ఉండటంతో ఉద్యోగస్తుల పరిస్థితి అయోమయంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితులలో దేశంలో లక్షలమందికి పైగా యువతీ యువతులకు డిజిటల్ నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ చేతులు కలిపి ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ కరోనా పరిస్థితులలో కూడ లక్షలమంది యువతకు ఉద్యోగాలు వచ్చే ఆస్కారం ఉంది అంటూ వస్తున్న వార్తలు అనేకమంది యువతలో కొత్త ఆశలను చిగురింప చేస్తున్నాయి.


ప్రస్తుతం జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ అందిస్తున్న ‘స్కిల్ ఇండియా’ పోర్టల్ తో మైక్రోసాఫ్ట్ లెర్న్ జతకలవడం ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ వర్గాలలో ఒక సంచలన వార్తగా మారింది. ప్రస్తుత ఆర్ధిక వ్యవస్థతో గిరాకీ ఉన్న నైపుణ్యాలతో పాటు భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే వ్యక్తిగత శిక్షణలు ఇచ్చే ఈపదకం ద్వారా దేశంలోని లక్షలాది మంది యువతకు శిక్షణ ఇవ్వడమే కాకుండా కంప్యూటర్ గురించి అసలు అవగాహనలేని గ్రామీణ ప్రాంత యువతకు కంప్యూటర్లకు సంబంధించిన ప్రాధమీక శిక్షణతో పాటు ఈ రంగంలో ప్రస్తుతం అధునాతనమైన కృత్రిమ మేధ క్లౌడ్ కంప్యూటింగ్ విషయాలలో శిక్షణ ఇవ్వడానికి దేశంలోని అనేక నగరాలలో శిక్షణా తరగతులు నిర్వహింపబోతున్నారు.


ప్రస్తుతం దేశంలోని అన్నిరంగాలలోను జరుగుతున్న డిజిటలీకరణ మార్పులు ప్రస్తుత కరోనా పరిస్థుతులలో కూడ కొనసాగుతాయి కాబట్టి ఈరంగాలలో సాంకేతిక నైపుణ్యం గల వ్యక్తులకు ఇలాంటి వ్యతిరేక పరిస్థితులలో కూడ ఉద్యోగాలు వచ్చే ఆస్కారం ఉంది. దీనితో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రేపటి అవసరాలకు తగ్గట్టుగా యువతను తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ప్రస్తుతం చేపట్టిన పరిస్థితులలో లక్షలాది మంది యువతకు భవిష్యత్ లో ఉద్యోగాలు వచ్చేలా చేసే ప్రయత్నాలలో భాగమే తమది ఈడిజిటల్ నైపుణ్యాల కార్యక్రమం అని ఈ ప్రాజెక్ట్ నిర్వాహకులు అంటున్నారు. కరోనా పరిస్థితులను తిట్టుకుంటూ కాలాన్ని వృథా చేయకుండా ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకున్నప్పుడు మాత్రమే ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: