భారతదేశ చరిత్రలో కనీవినీ ఎరుగని ఆర్ధిక సంక్షోభం రాబోతోంది అంటూ ప్రముఖ ఆర్ధికవేత్త కోశిక్ బసు ఇస్తున్న హెచ్చరికలు అందర్నీ కలవర పెడుతున్నాయి. అయితే ఇలాంటి వ్యతిరేక పరిస్థితులలో కూడ రానున్న రోజులలో భారతీయ ఐటీ రంగం ఎంతో ముందడుగు వేస్తుందని డిజిటల్ సాంకేతిక పరిజ్ఞాన వినియోగం విపరీతంగా పెరగడంతో పాటు రానున్న రోజులలో ఆరోగ్యరంగం విపరీతంగా విస్తరిస్తుంది అన్నఅంచనాలు కౌశిక్ బసు చేస్తున్నారు.


ప్రస్తుత కరోనా వ్యతిరేక పరిస్థితులను తిట్టుకోకుండా సరైన ఆలోచనలతో వ్యాపారవేత్తలు ఆలోచనలు చేస్తే అనేక కొత్తవ్యాపారాలు పరిశ్రమలు పుట్టుకు వస్తాయని తద్వారా దేశ ఆర్ధికపరిస్థితి మళ్ళీగాడిన పడుతుందని కౌశిక్ బసు అభిప్రాయం. ప్రస్తుతం కొందరి వ్యాపార జీవితాలను మార్చివేస్తోంది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుదేలు అవుతుంటే కొత్తకొత్త వ్యాపార అవకాశాలతో కొత్త బిలియనీర్లు పుట్టుకొస్తున్నారు. ముఖ్యంగా చేతికి తొడుక్కునే గ్లవ్స్‌ తయారు చేసే కంపెనీల ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. మలేషియాలో రబ్బరు గ్లవ్స్‌ తయారుచేసే సూపర్‌ మాక్స్‌ కంపెనీ తొలిసారిగా బిలియన్‌ డాలర్ల క్లబ్‌ లో చేరినట్టు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ పేర్కొంది. కరోనా వేళ సూపర్‌ మాక్స్‌ షేర్‌ 400 శాతం పెరగడంతో ఆసంస్థ ఫౌండర్‌ థాయ్‌ కిమ్‌ సిమ్‌ బిలయనీర్ల క్లబ్‌ లో చేరారు.


మన దేశంలోని అన్ని ఫార్మా కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. ప్రస్తుత కరోనా పరిస్థితులు వల్ల ఏర్పడ్డ పాఠశాలలు సభలు సమావేశాలు అన్నీ నిలిచిపోవడంతో వీడియో కాన్ఫరెన్స్‌ యాప్‌ లకు ఒక్కసారిగా డిమాండ్‌ ఏర్పడి మనదేశంలో కూడ అనేకమంది ఈయాప్ లను తయారుచేసే పనిలో బిజీగా ఉన్నారు. కరోనా వాతావరణం మధ్య జూమ్‌ యాప్‌ సృష్టికర్త ఎరిక్‌ యువాన్‌ ఆస్థుల విలువ ఈసంక్షోభ సమయంలో కూడ 2.58 బిలియన్‌ డాలర్లు పెరగడం కార్పోరేట్ కంపెనీల మధ్య హాట్ న్యూస్ గా మారింది.


జనం బయటకు రావడం మానేసి అందరు హోమ్ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఆన్ లైన్ అమ్మకాలు పెరిగి వాల్‌మార్ట్ అమెజాన్‌ వంటి కంపెనీల షేర్లు భారీగా పెరగడమే కాకుండా వారి సంపద కూడ వేల కోట్లల్లో పెరిగిపోయింది. దీనికితోడు జనంకు కరోనా భయాలు పెరిగిపోవడంతో కార్యాలయాలు షాపులు కార్లు బస్సులు ఇలా ప్రజలతో నేరుగా సంబంధం ఉన్నవాటికి అనునిత్యం శానిటైజ్ చేయవలసి వస్తుంది. దీనితో శానిటైజ్‌ వ్యారానికి సంబంధించిన ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈపరిస్థితుల మధ్య ప్రజలు ప్రభుత్వాలు పారిశ్రామిక వేత్తలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ప్రస్తుత ఆర్ధిక సంక్షోభం నుండి కేవలం రెండు సంవత్సరాలలో తెరుకోగలుగుతుంది అని కౌశిక్ బసు అభిప్రాయం.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: