ప్రస్థుత వ్యతిరేక పరిస్థితులను లెక్కచేయకుండా భారత్ లో 75, 000 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు గూగుల్ సీఇఓ సుందర్ పిచాయ్ చేసిన ప్రకటన కార్పోరేట్ వర్గాలలో సంచలనంగా మారింది. ‘గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్  ఫండ్’ పేరుతో ఈ పెట్టుబడులు వచ్చే 7 సంవత్సరాల లోపు ఇండియాలోకి రాబోతున్నాయి.


ఈ పెట్టుబడులతో కొన్నివేల సంఖ్యలో కొత్త ఉద్యోగ అవకాశాలు ఏర్పడబోతున్నాయి. ఈ భారీ పెట్టుబడులను భారత్ లోని కంపెనీల ఈక్విటీ కొనుగోళ్ళు మౌలిక వసతులు సాంకేతిక ఆవరణ వ్యవస్థ పై పెట్టబోతూ ఉండటంతో ఈ రంగంలో నైపుణ్యం ఉన్నవారికి అనేక ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. కంప్యూటింగ్ ను అన్ని భారత భాషలలోను అందుబాటులోకి తీసుకురావలసిన ఆవశ్యకత ఉంది అని చెపుతున్న పిచాయ్ చిన్న వ్యాపారాలు కూడ డిజిటైజేషన్ వైపు అడుగులు వేసేడట్లుగా గూగుల్ అనేక పధకాలు రచిస్తోంది.


కరోనా సంక్షోభంలో కూడ డిజిటల్ సాధనాల వినియోగం మరింత వేగం పుంజుకోవడం శుభసూచికం అని చెపుతూ రానున్న రోజులలో ప్రజలు అన్ని వస్తువులను తమ ఇళ్లకే డెలివరీ చేయించుకునే అలవాట్లను మరింత పెంచుకోబోతున్నట్లు పిచాయ్ వివరించారు. ఈ ఏడాది చివరి నాటికి భారత్ లో 22 వేల పాఠశాలలో పనిచేసే 10 లక్షలకు పైగా ఉపాధ్యాయులకు డిజిటల్ శిక్షణ ఇవ్వబోతున్నట్లు పిచాయ్ ప్రకటించడంతో ఇండియాలో ఆన్ లైన చదువులు శాస్వితం కాబోతున్నాయి అన్నసంకేతాలు వస్తున్నాయి.


రానున్న రోజులలో వైద్యం విద్య వ్యవసాయం తదితర రంగాలను కృత్రిమ మేధ టెక్నాలజీ శాసించబోతున్న పరిస్థితులలో భారతదేశంలోని యువతకు అనేక అవకాశాలు రాబోతున్నయి అన్నసంకేతాలు పిచాయ్ ఇస్తున్నాడు. దేశంలోని ప్రతి ఒక్కరికీ సమాచారాన్ని వారివారి స్థానిక భాషలలో అందుబాటులోకి తేవడమే తన ధ్యేయం అని సుందర్ పిచాయ్ మాటలు నిజం అయితే రానున్న రోజులలో ప్రాంతీయ భాషలకు మరింత విలువ పెరుగుతుంది. దీనితో రానున్న రోజులు అన్నీ యువతకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండే మంచిరోజులే అన్న సంకేతాలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: