రుద్రమదేవి చరిత్రని తెలుసుకుందామని, ఆమె వీరగాధలు వీక్షిద్దామని సినిమా కు వచ్చిన నాకు ,ఏదో 'జెండర్ ఐడెంటిటీ' (జన్మ రహస్యం ) కాన్సెప్ట్ పైన సస్పెన్స్ థ్రిల్లర్ ఫిలిం చూస్తునట్లు అనిపించిందే తప్ప ఎక్కడా రుద్రమ దేవి చరిత్ర కనిపించ లేదు. రుద్రమదేవి గొప్ప చిత్రం అంటూ, మన చరిత్ర ప్రపంచానికి చాటుదాం అని, ‘రుద్రమదేవి’ గొప్పదనమేంటో అందరికీ తెలియజెప్పడానికే సినిమా తీశానoటూ అని తెగ ప్రగోల్భాలు పలికి మీరు తీసింది ఏంటి ? 


అసలు సిసలైన రుద్రమ చరిత్ర తీయకుండా కల్పితాలు జోడించి ,రుద్రమ ను అశ్లీలంగా చూపించి ,గోనగన్నారెడ్డి క్యారెక్టర్ నే ఎక్కువగా హైలైట్ చేసి ఎందుకని రుద్రమదేవి ని పనికిరాకుండా చేసి పడేసారు.?రుద్రమ జరిపిన పోరాటాలన్నింటిలో ఆమెకు బాసటగా నిలిచిన ..గోన గన్నారెడ్డి, రేచర్ల ప్రసాదాదిత్యుడు, రుద్రనాయకుడు, జన్నిగదేవుడు, త్రిపురాంతకుడు, బెండపూడి అన్నయ్య ముఖ్యులు. మరి గోన గంగ రెడ్డి నే ఎందుకు చూపించా రు.? మిగతా వాళ్ళు ఏమైనట్టు?వేయి స్తంభాల గుడి, పాలంపేటలోని రామప్ప గుడి, భద్రకాళి ఆలయం, ఘణపురం కోటగుళ్ళు కాకతీయుల శిల్పకళా పోషణకు, నైపుణ్యానికి చక్కని తార్కాణం. సంగీతం, సాహిత్యం, శిల్పకళ, నృత్యం కలగలసిపోయి విరాజిల్లాయి, ఎందుకని వీటి ప్రస్తావనే తీసుకు రాలేదు?


ఆడపిల్ల అయితే రాజ్యాధికారం ఇవ్వరని ,శత్రువులు,దాయాదులు,సామంత రాజుల కుట్ర లకి సవాలు విసురుతూ ,మగవాడి లాగే పెంచుతారు, కాని రుద్రమకు ఇరవై ఐదవ యేట నిడదవోలు రాజైన చాళుక్య వీరభద్రేశ్వరుడితో వివాహమైంది. వారికి ఇద్దరు కూతుళ్ళు ముమ్మడమ్మ, రుద్రమ్మ కలిగారు. ఈమెకు మరో పెంపుడు కూతురు రుయ్యమ్మ కూడా ఉంది. తనకు మగ సంతానం లేక పోవడంతో రుద్రమ తన పెద్ద కుమార్తె ముమ్మడమ్మ కుమారుడైన ప్రతాపరుద్రుడ్ని దత్తత తీసుకుని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. ఇలాంటివి ప్రస్తావించకుండా, ఆమె జన్మ రహస్యం మామూలుగా చెప్పి వదిలేస్తే పోయే దానికి, ఇదే విషయం పైన సినిమా అంతా నడపించడం చూస్తే , రుద్రమ దేవి సినిమా అనిపించదు, ఏదో థ్రిల్లర్ ఫిలిం చూస్తునట్లు ఫీలింగ్ కలుగుతుంది. ఎనభై ఏళ్ల వయసు లో కత్తి పట్టి స్వయం గా కదన రంగాన దూకి అంబ దేవుడి ని ఓడిస్తుంది. ఇలాంటి వీరోచిత విన్యాసాలు ఎక్కడా చూపించ లేక పోయారు. పగ తో రగులుతున్న అంబ దేవుడు, ఒక కార్తీక సోమవారం సందర్భం గా పరమ భక్తురాలైన రుద్రమ పూజ లో నిమగ్నమై ఉనప్పుడు పూజారుల స్థానం లో తన మనుషుల్ని పంపి వెన్నుపోటు పొడిచి చంపించేశారు .


ఇలాంటి ఘనమైన చరిత్ర రుద్రమది.పోనీ చివర్లో అయినా రుద్రమ వీరోచిత విన్యాసాలు చూసే అవకాశం కల్పించారా అంటే అదీ లేదు. ఎంత సేపు ,మీరు పెట్టిన డబ్బుని రాబట్టుకోడానికి ,గోన గంగ రెడ్డి పాత్రని వాడుకున్నారు.


నిజం చెప్పాలంటే,200 రూపాయలు పెట్టి ఈ సినిమా చూసే బదులు,20 రూపాయలు పెట్టి రుద్రమ దేవి పుస్తకం కొన్నుకొని చదువుతే మాకు చాల విషయాలు తెలుస్తాయి.


మీరు ఏదో చెబ్తారని సినిమా చూడటాని కి వస్తే,థ్రిల్లర్ మూవీ చూపించారు.దయ చేసి ఇలాంటి సినిమా లు ఎప్పుడు తీయకండి,తీస్తే మాకు తేలియన గొప్ప గొప్ప విషయాలు చెప్పండి,అంతే గాని చరిత్రని చెత్త చెయ్యకండి.



మరింత సమాచారం తెలుసుకోండి: