అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాటి. పెరిగినదంతా ఉత్తరాఖండ్ అయినా అక్కడకు వచ్చిన తెలుగు డబ్బింగ్ సినిమాలను చూసుకుంటూ పెరిగి టాలీవుడ్ పై ప్రేమ పెంచుకుంది. ఇక మొదటి సినిమా అందాల రాక్షసిలో అందం అభినయంతో అలరించిన ఈ చిన్నది పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించి మెప్పిస్తుంది. మనం సినిమా టైంలో ఏదో ఓ చిన్న రోల్లో కనిపించి మాయమయ్యేసరికి అమ్మడి పని అయిపోయిందనుకున్నారంతా..కాని రీసెంట్ బ్లాక్ బస్టర్ భలే భలే మగాడివోయ్ తో అందరికి మరోసారి షాక్ ఇచ్చింది లావణ్య.


సినిమా హిట్ అవ్వడానికి మారుతి, నానిలే ముఖ్య కారణం అయినా భలే భలే మగాడివోయ్ సినిమాలో నందనగా క్యూట్ లుక్స్ తో కుర్రళ్ల హార్ట్ బీట్ వేగం పెంచింది ఈ సుందరి. అయితే ఆ సినిమా ఇచ్చిన హిట్ కిక్ అమ్మడికి మంచి మజానిచ్చింది. కెరియర్ అయిపోయింది అనుకున్న వారందరికి సినిమా హిట్ తో సమాధానం చెప్పింది ఈ సొట్టబుగ్గల సుందరి. అందుకే ప్రస్తుతం ఫ్రెండ్స్ తో జాలీ ట్రిప్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుంది. అయితే సినిమాలో నిండైన దుస్తుల్లో కనిపించి అసలు స్కిన్ షోకి చాన్స్ ఇవ్వని లావణ్య విహార యాత్రలో మాత్రం స్విమ్ సూట్లో కూడా దర్శనమిస్తుంది.


బాలి దీవుల్లో లావణ్య హాట్ స్టిల్స్ :


ఏ తన అందం కేవలం తన ఫ్రెండ్స్ తో చూపిస్తుందా ప్రేక్షకులు ఏం పాపం చేశారని అనుకుంటున్న సమయంలో వాటిని తన అఫిషియల్ ఫేస్ బుక్ లో పెట్టి అందరికి షాక్ ఇచ్చింది. ఇండోనేషియా బాలి దీవుల్లో లావణ్య విహార యాత్ర చేస్తూ హాట్ స్టిల్స్ తో దిగిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తున్నాయి. అమ్మడు స్విమ్ సూట్ వేసుకుని వీపు భాగం చూపిస్తు దిగిన ఫోటో చూసి కుర్రాళ్లు భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక రకరకాల స్టిల్స్ ఇస్తూ లావణ్య దిగిన ఈ ఫోటోలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.


మరి పాప ఇంత రెచ్చిపోయింది కేవలం ఫ్రెండ్స్ కోసమేనా ఎలాగు ఇవి ఫేస్ బుక్లో పెడితే తను కూడా మిగతా హీరోయిన్స్ లా హాట్ సినిమాలు చేయడానికి కూడా రెడీ అన్నట్టు సిగ్నల్స్ ఏమన్నా ఇస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. మరి ఇప్పటికైతే అమ్మడు స్కిన్ షోకి దూరం ఉంటూ వచ్చింది. మరి ఒకవేళ లావణ్య కూడా విప్పడం మొదలెడితే ఇక కుర్రాళ్లను ఆపడం కష్టమే. ప్రస్తుతం లచ్చిందేవికి ఓ లెక్కుంది, సోగ్గాడే చిన్ని నాయన సినిమాలు చేస్తున్న లావణ్య రెండు సినిమాలు హిట్ అవుతాయని బలంగా నమ్ముతుందట. మరి రిలీజ్ అయితే గాని తెలియదు అమ్మడి నమ్మకం ఎంతవరకు పనిచేసిందో..


మరింత సమాచారం తెలుసుకోండి: