తెలుగు ఇండస్ట్రీలో ‘సీతాకోక చిలుక’ సినిమాతో బాల నటుడిగా వెండితెరకు పరిచయం అయిన ఆలీ..తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా, హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నాడు.   ఈ మద్య ఆలీ బుల్లితెరపై యాంకర్ అవతారమెత్తాడు..అంతే కాదు సినిమా ఈవెంట్స్ కి కూడా వ్యాఖ్యాత గా వ్వవహరిస్తున్నాడు. ఇక సినిమాలో సీనియర్ హాస్యనటుడిగా మంచి పేరు ఉన్నా..ఇప్పుడు ఆలీ అంటే యాంకర్లు, కొంత మంది హీరోయిన్లు చిర్రెత్తిపోతున్నారు. ఈ మద్య ఆలీ కుళ్లు జోక్స్, చెత్త కామెంట్స్ తో డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ.. యాంకర్లను, హీరోయిన్లను ఇబ్బంది పెడుతన్నాడు..ఆ మద్య తోటి యాంకర్ పై కామెంట్స్ చేసి తర్వాత తిట్టించుకున్న సందర్భాలూ ఉన్నాయి.

 ‘సైజ్ జీరో’ చిత్రానికి సంబంధించి ఆడియో ఫంక్షన్లో..ఆలీ అనుష్క తొడలపై కామెంట్ చేశాడు.. ఈ వ్యాఖ్యలపై మహిళలు మండిపడుతున్నారు. 'అనుష్క తొడలు' అంటూ ఆలీ పెద్ద చర్చకు తెర లేపాడు. అనుష్క తొడలు అద్భుతమని ఆ తొడలంటే తనకు ఎంతో ఇష్టమని చేసిన ఆలీ వ్యాఖ్యలపై మండిపడుతూ హైదరాబాద్ కు చెందిన ఆశ అనే ఓ యువతి ఫైరయింది. ఇలాంటి అసభ్యకర కామెంట్స్ చేస్తూ అవమానపరిస్తే మహిళ సంఘాలతో ఆలీ అంతు చూస్తామంటూ ఓ వీడియో చేసి నెట్ లో పెట్టింది. ఆ మద్య తోటి యాంకర్ పై కామెంట్స్ చేసి తర్వాత తిట్టించుకున్న సందర్భాలూ ఉన్నాయి. మరో ఆడియో ఫంక్షన్లో సమంత నడుం ‘బెజవాడ బెంజ్ సర్కిల్’ లా ఉందని కామెంట్ చేశాడు..తర్వాత మరో యాంకర్ శ్యామలపై కామెంట్ చేశాడు..తర్వాత రాశీఖన్నా,రకూల్ ప్రితిసింగ్ ఇలా చెత్త డైలాగ్స్, చెత్త కామెంట్స్ చేశాడు..అప్పుడు నవ్వుకోవడానికి బాగున్నా తర్వాత వాటిపై వచ్చే విమర్శలు చూసి యాంకర్లు, హీరోయిన్లు బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి.

ఈ తండ్రికొడుకులు(రాఘవేంద్రరావు-ప్రకాష్) ఏంటోగానీ... నడుము మాత్రం వదలట్లేదు. ఆయన నడుం వదల్లేదు.. కొడుకు నడుంవదల్లేదు. ఆయన ప్రపంచంలోని వున్న పండ్లు అన్నిటితో కొట్టేసాడు. ప్రకాష్ ఇపుడు జిలేబితో కొడుతున్నాడు అని చెప్పుకొచ్చాడు. అంతే కాదు అనుష్క తొడలపై కూడా కామెంట్ చేశాడు..ఆ సమయంలో అక్కడున్నవాళ్లంతా నవ్వారు వారితోపాటే అనుష్క కూడా నవ్వింది కానీ ఇలాంటి పిచ్చి కామెంట్లతో తన పరువు తీశాడే..అని లోలోపల చాలా బాధపడినట్లు సన్నిహితులు తెలిపారు. ఈ విషయంపై అనుష్క బెస్ట్ ఫ్రెండ్ రానా ఆలీకి ఘాటుగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతే కాదు వైజాగ్ లో కొంత మంది మహిళఆ సంఘాలు కూడా ఆలి ని నిలదీశారు.

ఆలీ కామెంట్స్ చేసిన సెలబ్రెటీలు


మొత్తానికి అన్ని విషయాలు దృష్టి లో పెట్టుకుని మీడియా ద్వారా ఆలీ తన వల్ల ఎవరి మనోభావాలు దెబ్బ తిని ఉంటే క్షమించమని కోరారు.. అయితే ఇలాంటి విషయాలు ఆలీకి కొత్తేమి కాదని స్టేజీ ఎక్కితే చాలు మనోడు నోటి దూలతో పిచ్చి కామెంట్లు చేస్తారని కొంత మంది విమర్శిస్తూనే ఉన్నారు. గతంలో సుమ కూడా ఇలాంటి ఇబ్బంది ఎదురౌతుందని ఆలీతో కో యాంకరింగ్ చేయలేని తెగేసి చెప్పిందట..దీనికోసం కొన్ని సోలోగానే చేసింది. సో... మరి ఆలీ ఏవైనా ఆడియో ఫంక్షన్లకు ఆలీని పిలుస్తారా..పిలిస్తే మనోడు స్టేజిపై కామ్ గా తన పని తను చేస్తాడా లేదా మళ్లీ హీరోయిన్లపై కామెంట్స్ చేస్తారా చూడాలి ఒకవేళ కామెంట్ చేస్తే మాత్రం ఈ సారి మనోడిపై వేటు తప్పదని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: