తెలుగు ఇండస్ట్రీలో కామెడీ యాక్టర్స్ కి కొదవేలేదు..అయితే కామెడీ పండిస్తూనే హీరోలుగా చేసి మెప్పించారు..  పద్మనాభం,రాజబాబు, చలం, ఆలీ లాంటి వాళ్లు కామెడీగా నటిస్తూనే హీరోలుగా కూడా నటించారు. ఇక వీరిజాబితాలోకే వస్తాడు కామెడీ హీరో సునీల్. త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ మంచి స్నేహితులు. ఈ బంధంతోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు సునీల్. మొదట్లో బొద్దుగా లావుగా  ఉండటంతో కామెడీ వేషాలు బాగా వచ్చాయి..తనదైన మ్యానరీజంతో అందరినీ బాగా ఆకర్షించాడు సునీల్.

కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన సునీల్ ఒక దశలో తెగ బిజీ గా మారాడు ఎంతగా అంటే  క్షణం తీరిక లేనంతగా కొన్ని సినిమాలు తన బిజీ షెడ్యూల్ వల్ల లాస్ కూడా అయిన రోజులు ఉన్నాయి. అలాంటి కామెడీ హీరో ఇప్పుడు కష్టాల్లో పడ్డాడు. ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సునీల్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చాన్స్ కొట్టాడు. ‘మర్యాద రామన్న’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తర్వాత వచ్చిన మిస్టర్ పెళ్లి కొడుకు, పూలరంగడు అపజయం పాలయ్యాయి.

కృష్ణాష్టమి పోస్టర్


తర్వాత నాగచైతన్య కాంబినేషన్ లో వచ్చి తడాకా సినిమా కాస్త పరవాలేదు అనిపించుకున్న అది సోలో సినిమా కాదు కాబట్టి ఆ హిట్ మనోడి ఖాతాలో పడలేదు. సరైన హిట్ లేక వరుస ఫ్లాప్ లతో అసలు సునీల్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అంతే కాదు సునీల్ వేరే కార్యక్రమాలకు కూడా ఎక్కువ అటెండ్ కాకపోవడంతో మనోడిని తెలుగు అభిమానులు మరిచిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ‘కృష్టాష్టమి’ సినిమా ఒక్కటే చేతిలో ఉంది ఆ సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ సాధిస్తే ఓకే ఒకవేళ అది గనక ప్లాప్ అయితే మనోడి పరిస్థితి అంతే.. అంటున్నారు సినీ వర్గాలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: