కథ ,పిల్లల నటన, సూర్య, అమలా పాల్కథ ,పిల్లల నటన, సూర్య, అమలా పాల్మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్నవీన్ (నిషెష్), నయన (వసిషణవి) ఇద్దరు అల్లరి పిల్లలు.. చదువు తప్ప మిగతా విషయాలలో చాలా యాక్టివ్ గా ఉంటారు. వారు ఎక్కడ ఉంటే అక్కడ అల్ల కల్లోలమే. సంవత్సరంలో రెండు మూడు స్కూల్స్ మారడం వెళ్లిన ప్రతి చోట మిస్ బిహేవ్ చేసి గొడవలు తేవడం ఇదే వారి పని. ఇక అలా కుదరదని హాస్టల్ లో వేస్తారు.. ఓక్రిడ్జ్ స్కూల్, హాస్టల్ లో చదువుతున్న వీరు అక్కడ అమ్మ నాన్నలను బాగా మిస్ అవుతారు. అక్కడ కూడా హాస్టల్ లో వీరి చిలిపి చేష్టలతో అందరిని భయపెట్టి హాస్టల్ నుండి కూడా గెంటేసేలా చేసుకుంటారు. ఇక మరో పక్క అదే కాలనీలో ఉంటున్న చైల్డ్ సైక్రియాటిస్ట్ డాక్టర్ రామనాధం (సూర్య), అతని భార్య విద్య (అమలా పాల్) ఆ పిల్లలను వారి పేరెంట్స్ ఆలోచనలను మారుస్తారు. పిల్లలు అటెన్షన్ డెఫిషిట్ హైపర్ డిసార్డర్ (ఏ.డి.హెచ్.డి) లో ఉంటారని సూర్య పేరెంట్స్ కు చెబుతాడు. విద్య పనిచేసే ఓ స్కూల్ లో పిల్లలను చేర్పించి వారి ఆలోచన తీరు మారుస్తుంది. ఇక ఈవెంట్ కాంపిటీషన్ 2014లో తమ టాలెంట్ బయటపెట్టి బెస్ట్ గా నిలిచేలా చేస్తారు. నయన, నవీన్ చేసే అల్లరి ఎలా తగ్గించారు..? వారికి రామనాధం ఇచ్చిన సలహా ఏంటి..? అన్నది అసలు కథ.     

సూర్య నిర్మించిన ఈ మేము సినిమాలో తాను కూడా భాగమై తన సింపుల్ నటనతో సినిమాకు అందం తెచ్చాడు. ఇక విద్యగా నటించిన అమలా పాల్ కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా చిన్న పిల్లలుగా నటించిన నిషేష్, వైష్ణవిలు అదరగొట్టేశారు. తమ వయసుకు తగ్గ యాక్టివిటీని కెమెరా ముందు నటించి స్క్రీన్ మీద కనిపించేలా బాగా చేశారు. ఇక పేరెంట్స్ గా నటించిన కార్తిక్ కుమార్, బింధుమాధవిలు కూడా తమ నటనతో ఇంప్రెస్ చేశారు.     

సినిమా కథాంశం చిన్న పిల్లలదే అయినా సినిమాలో వారికి మంచి స్కోప్ చూపించాడు దర్శకుడు పాండిరాజ్. సినిమాలో దర్శకుడి ఆలోచన ప్రతి ఒక్క పిల్లవాడి తల్లి తండ్రులకు నచ్చుతుంది. ఇక ముఖ్యంగా మేము సినిమా కెమెరామన్ పనితనం బాగుంది. స్కోప్ ఉన్నంత వరకు సినిమాను అందంగా తెరకెక్కించారు. ఎడిటింగ్ కూడా ఓకే అనిపిస్తుంది. మ్యూజిక్ విషయంలో ఇంకాస్త ఎక్కువ దృష్టి పెట్టుంటే బాగుండేది. సూర్య ప్రొడక్షన్ వాల్యూస్ సినిమకు కావాల్సినంత రిచ్ నెస్ తెచి పెట్టింది. 

తణుకులో జరిగే ఓ స్కూల్ పిల్లల పరుగు పందెంతో సినిమా స్టార్ట్ అవుతుంది. సరదాగా ఐస్ తింటూ పరుగు పందెం చూద్దామనుకున్న రామనాధం ఒక పిల్లాడు రెచ్చగొట్టగా ఆ పందెంలో పాల్గొంటాడు. 2800 మీటర్లు గల ఓ సర్కిల్ లో 7 రౌడ్లు పూర్తి చేయాలన్నది పందెం. అయితే కావాలని మరి పోటీలో నిలిచిన పిల్లలల్లో రామనాధం ఒక్క రౌండ్ కాదు 7 రౌడ్లు ప్రయాసపడి మరి నెగ్గుతాడు. ఇక ఆ స్కూల్ ప్రిన్సిపాల్ మొదటి వచ్చిన పిల్లాడి కన్నా చివరిగా వచ్చిన రామనాధం కు ప్రైజ్ ఇస్తాడు. అక్కడే సినిమా కథ చెప్పే ప్రయత్నం చేశాడు పాండిరాజ్. గెలుపు ముఖ్యం కాదు.. జీవితంలో పోరాడటం ముఖ్యం. ఇక ఆ పిల్లాడు పరుగులు చేస్తున్నప్పుడు వచ్చిన విమర్శలు, పొందిన అభినందనలు అన్ని జీవితంలో ఎదురయ్యేవే అని అర్ధం వచ్చేలా చెప్పాడు. 

అయితే అలా తను పెరిగిన రామనాధం తన భార్య గర్భిణితో ఉన్నప్పుడు పుట్టబోయే బిడ్డకు కడుపులో ఉండగానే అన్ని మంచి ఆలోచనలను వచ్చేలా చేస్తాడు. ఇక ఓ పక్క అల్లరి చిల్లరగా పెరిగిన ఓ ఇద్దరు పిల్లలు.. రోజుకో గొడవ తెచ్చే పిల్లలను ఎలా జీవితంలో గెలిచేలా చేశారన్నది సినిమాలో చెప్పాడు దర్శకుడు పాండిరాజ్. ఆల్రెడీ పసంగ-2 గా తమిళంలో రిలీజ్ అయ్యి హిట్ అయిన ఈ సినిమా మేముగా తెలుగులో రిలీజ్ చేశారు.   


పసంగ, మెరినా సినిమాలకు నేషనల్ అవార్డ్ పొందిన పాండిరాజ్ మరోసారి తన సత్తా చాటాడు. కమర్షియల్ అంశాలున్న సినిమా కన్నా ఆలోచనతో తీసే సినిమా మిన్న అన్నట్టు.. తన కథలతో తల్లిదండ్రులకు ఓ భాధ్యత గుర్తుచేస్తున్నాడు దర్శకుడు పాండిరాజ్. మేము సినిమా మొత్తం తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచనతో ఉంటుందో అలానే పిల్లలు ఉంటారని చెప్పాడు. అంతేకాదు తల్లి తండ్రులకు ఉన్న మంచి చెడులన్ని పిల్లలకు వస్తాయని చూపించాడు. తల్లి గర్భమే బిడ్డకు మొదటి పాటశాల అని చూపించాడు. 


సినిమా పిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నచ్చుతుంది. అయితే ఇంకాస్త మంచి సన్నివేశాలుంటే బాగుండేది అనిపిస్తుంది. కథ బలమైనదే కాని దాన్ని తెర మీద చూపించే ప్రయత్నంలో ఎంచుకున్న కథనం ఇంకాస్త బాగుంటే సినిమా బాగా వచ్చేది. సూర్య అమలా పాల్ లు తమ క్యారక్టర్స్ కు న్యాయం చేశారు. ఇక సూర్య ఫ్యాన్స్ తో పాటుగా పిల్లలను ప్రేమించి వారి ఆలోచనను గుర్తించే పేరెంట్స్ కు సినిమా నచ్చుతుంది.  

మేము రెగ్యులర్ సినిమా కాదు ఇదేదో ఎంటర్టైన్ మెంట్ సినిమా అనుకుని వెళ్తే ఇబ్బంది పడతారు. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎలాంటి తిప్పలు పడుతున్నారో చెప్పే కథ. మీ పిల్లలను తీసుకుని వెళ్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక యూత్ కు సినిమా ఎక్కడం కష్టమే. 
Surya,Amala Paul,Bindu Madhavi,Pandiraj,Julakanti Madhusudan Reddy,Arrol Corelliసూర్య 'మేము' కేవలం పిల్లల కోసమే..!

మరింత సమాచారం తెలుసుకోండి: