తెలుగు తెరపై ఎప్పుడెప్పుడు కనిపిస్తాడా అని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అభిమానులకు ఓ తీపి కబురు అందించింది చిత్ర యూనిట్. బాబీ దర్శకత్వంలో పవన్ కళ్యాన్ నటిస్తున్న ‘సర్ధార్ గబ్బర్ సింగ్ ’ షూటింగ్ షర వేగంగా జరుగుతుంది. ఇప్పటికే గుజరాత్,పూణే, హైదరాబాద్ లో షూటింగ్ జరిపారు. తాజాగా గుజరాత్ లో కీలక ఘట్టాలు షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేయనున్నట్టు సమాచారం తెలుస్తోంది.

గబ్బర్ సింగ్ సీక్వెల్ గా బాబీ సర్ధార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై పవన్ అభిమానుల్లో భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ మద్య ఈ చిత్రంపై రక రకాల రూమర్స్ సోషల్ నెట్ వర్క్ లో చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై ఇప్పటికే ఆ చిత్ర నిర్మాత ఓ క్లారిటీ కూడా ఇచ్చాడు. సర్ధార్ గబ్బర్ సింగ్ షూటింగ్ కూల్ గా నడుస్తుందని ఏప్రిల్ లో ఈ చిత్రం థియేటర్లో కి రాబోతుందని తెలిపారు.  సర్ధార్ లో పవన్ గెటప్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి.


సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాన్


ఈ సినిమా తెలుగు సినిమా రికార్డ్ లను బ్రేక్ చేస్తోందనే నమ్మకంలో పవన్ అభిమానులు ఉన్నారు.  అంతే కాదు ఈ చిత్రంలో పవన్ సరసన కలువ కళ్ల సుందరి కాజల్ నటిస్తుంది. అంతే కాదు రాయ్ లక్ష్మీ, సంజనలు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారట. అయితే ఇటీవల చిత్ర యూనిట్ ఓ టీజర్ ను విడుదల చేసింది. జనవరి 1 న సర్ధార్ చిత్రానికి సంబంధించిన మరో టీజర్ ను విడుదల చేయనున్నట్టు సమాచారం తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: