నందమూరి హీరోల మధ్య వార్ మొదటికొచ్చినట్టే అని అంటున్నారు. తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఈ మాటలు నందమూరి అభిమానులని కలవరపెడుతున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో ‘నాన్నకు ప్రేమతో’ అనే సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం ఈ మూవీ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ సంక్రాంతి సీజన్‌కి రిలీజ్ అవుతున్న భారీ చిత్రాలలో నాన్నకు ప్రేమతో మూవీ ఒకటి.


ఇప్పటికే బాలయ్య నటించిన డిక్టేటర్ మూవీ, నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ననాయన మూవీలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. అయితే గతంలో డిక్టేటర్ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుండగా, నాన్నకు ప్రేమతో మూవీని డిసెంబర్ లోకానీ, సంక్రాంతి తరువాత కానీ రిలీజ్ చేయాలని భావించారు. తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ, సంక్రాంతి బరిలో ఎట్టిపరిస్థితుల్లో నాన్నకు ప్రేమతో రిలీజ్ కావాలని జూనియర్ పట్టుబట్టాడంట.


అలాగే సుకుమార్ సైతం సంక్రాంతిని టార్గెట్ చేసుకొని మూవీని అనుకున్న టైం కంటే ముందుగా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకొని శరవేగంగా షూటింగ్ ని పూర్తి చేశాడు. నిజానికి నాన్నకు ప్రేమతో మూవీకి టైం తీసుకొని క్యాలిటీ వర్క్ ని చేస్తే..మరో ఇరవై రోజుల సమయం పడుతుంది. కానీ, సంక్రాంతి టార్గెట్ అనుకోవటంతో  చిత్ర యూనిట్ అంతా కలిసి వేగంగా పూర్తి చేశారు. ఇక ఇదే సంక్రాంతికి బాలయ్య నటించిన డిక్టేటర్ మూవీ ఉన్నప్పటికీ, యంగ్ టైగర్ తన మూవీని రిలీజ్ చేయటంపై సిసలైన నందమూరి అభిమానులు ఒకింత ఒప్పుకోవటం లేదు.


నాన్నకు ప్రేమతో మూవీని ఇండైక్ట్ గా వాయిదా వేయాలని డిక్టేటర్ టీం నుండి నాన్నకు ప్రేమతో టీంకి మెసేజ్ వచ్చినప్పటికీ, జూనియర్ మాత్రం సంక్రాంతికి ఫిక్స్ కావటం ఆశ్ఛర్యాన్ని ఇచ్చింది. దీంతో బాలయ్య మూవీకి పోటీగా నాన్నకు ప్రేమతో మూవీ రెడీ కావటం...అలాగే కళ్యాణ్ రామ్ సపోర్ట్ జూనియర్ కి మెండుగా ఉండటం వంటివి బాలయ్యని టార్గెట్ చేసే దిశగా ఏదో ప్రయత్నాలు  జరుగుతున్నాయని అంటున్నారు. మొత్తంగా బాబాయ్ అంటూనే, బాలయ్య డిక్టేటర్ మూవీపై జూనియర్ గురి పెట్టాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: