తెలుగు ఇండస్ట్రీలో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే అంజలి నటించిన సినిమాలు కొన్నే అయినా మంచి పేరు సంపాదించింది. జర్ని, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,గీతాంజలి మంచి సక్సెస్ సాధించిన సినిమాలు. ఇక అప్పడప్పుడు కొన్ని ఐటమ్ సాంగ్స్ లో కూడా మురిపిస్తుంది. ఈ మద్య వచ్చిన శంకరాభరణం లో కాస్త నిరాశ పరిచినా  ప్రస్తుతం నటసింహ నందమూరి బాలకృష్ణ తో డిక్టేటర్ సినిమాలో నటిస్తుంది. ఆ మద్య వచ్చిన ‘గీతాంజలి’ చిత్రంలో ద్విపాత్రాభినయంలో అంజలి మంచి నటన కనబరిచింది.

ఇక తెలుగు లో కామెడీ, హర్రర్ కాన్సెప్టులో వచ్చి చిత్రాల మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. ఈ తరహా సినిమాలు భయపెడుతూనే నవ్విస్తూ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తున్నాయి. ఈ సంవత్సరం విడుదలైన ‘రాజుగారి గది’ చిన్న సినిమాల్లో మంచి హిట్ సాధించిన చిత్రంగా పేరు సంపాదించింది.

అంజలి 


ఈ సినిమా స‌క్సెస్ ఇచ్చిన స్పూర్తితో ఓంకార్ రాజు గారి గ‌ది సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో ప్ర‌ధాన  పాత్ర కోసం అంజ‌లిని సంప్ర‌దించార‌ట‌. క‌థ విని అంజ‌లి ఓకె చెప్పింద‌ట‌. ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. గీతాంజ‌లి సినిమాతో ఆక‌ట్టుకున్న అంజ‌లి మ‌ళ్లీ మ‌రో హార్ర‌ర్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. మరి రాజుగారి గతి సీక్వెట్ ఎంత మేరకు సక్సెస్ సాధిస్తుందో అంజలికి ఎలాంటి పేరు సంపాదిస్తుందో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: