సినిమాలలోనే కాకుండా ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ గా పేరు గాంచిన ఖుష్బూ జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ ఈరోజు టాపిక్ ఆఫ్ ది డేగా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ గురించి ఖుష్బూ ఎందుకు ఇంత ప్రేమ ఒలక బోస్తోంది అన్న సందేహం చాలామందిలో ఏర్పడింది. జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన ‘యమదొంగ’ సినిమాలో యముడి భార్యగా ఖుష్బూ నటించిన విషయం తెలిసిందే.

అయితే ఆ తరువాత ఖుష్బూ జూనియర్ నటించిన ఏ సినిమాలోను నటించలేదు. అయినా సంక్రాంతికి విడుదల కాబోతున్న జూనియర్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమా పై ఆసక్తిని కనపరుస్తూ ట్వీట్ చేసింది ఖుష్బూ. అంతేకాదు తాను జూనియర్ కు వీరాభిమానిని అని అంటూ ఆ సినిమాను మిస్ కాకుండా చూస్తానని ట్విట్ చేసింది. 

నందమూరి వార్ కు రెడీ అవుతున్న జూనియర్ కు ఈ ట్విట్ ఎంతో జోష్ ను ఇస్తుంది అనడంలో సందేహం లేదు. సంక్రాంతి పండుగ సమీపిస్తూ ఉండటంతో ఈసినిమా యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో పరుగులు తీస్తోంది. ఎట్టి పరిస్తుతులలోను ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను 8వ తారీఖున పూర్తి చేసి ఈసినిమా విడుదలకు సంబంధించి అధికారికమైన క్లారిటీ ఇవ్వడానికి సుకుమార్ పరుగులు తీస్తున్నాడు. 

అయితే ఈసినిమాకు ధియేటర్ల విషయంలో సమస్యలు వస్తాయి అని ఇప్పటికే వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ సినిమా దర్శక నిర్మాతలు అటువంటి సమస్యలు ఏమి ఏర్పడకుండా ప్రయత్నాలు చేయడమే కాకుండా చివరి నిముషంలో బయ్యర్ల నుండి ఎటువంటి సమస్యలు తల ఎత్తకుండా చాల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అనే వార్తలు ఉన్నాయి. అయితే ఈసినిమా గురించి టాలీవుడ్ సెలెబ్రెటీలు ఎవ్వరూ మాట్లాడకపోయినా ఒక కోలీవుడ్ సెలెబ్రెటీ ఖుష్బూ జూనియర్ కు సపోర్ట్ గా రావడం అందర్నీ ఆశ్చర్య పరిచే విషయం..


మరింత సమాచారం తెలుసుకోండి: