కొన్ని కామెడీ సన్నివేశాలుకొన్ని కామెడీ సన్నివేశాలుపైన చెప్పిన సన్నివేశాలు తప్ప మిగిలిన సన్నివేశాలు ...

సముద్ర తీరం ఉన్న వైజాగ్ లో కథ మొదలవుతుంది. పలువురికి మంచి చేయాలనే ఉద్దేశంతో పలు సేవా కార్యక్రమాలతో సమాజంలో మంచి వ్యక్తిగా పేరు సంపాదించుకున్న వ్యక్తికి వారసుడే మన హీరో రాజా(శర్వానంద్). ఎలాంటి పనీ పాటా లేకుండా తన మావయ్య శీను (ప్రభాస్ శీను)తో కలిసి అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడు. అలాంటి వీరిద్దరికీ పోసాని కృష్ణమురళి ఓ పని ఇస్తాడు. ఆ పని మీద రాజా శ్రీను హైదరాబాద్ వస్తారు అక్కడ రాజా, అమ్ము (సురభి)ని చూసి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయిని ప్రేమలో పడేయడం కోసం స్నూపీ అనే ఓ కుక్క పిల్లను తీసుకొచ్చి ఇవ్వాల్సి వస్తుంది. ఇక అలా మొదలైన రాజా జర్నీలోకి వరుసగా బినామీ బ్రిటీష్ (సుప్రీత్), ఇనుము (ధన్‍రాజ్), పొల్యూషన్ గిరి (సప్తగిరి), బిల్‌గేట్స్ (బ్రహ్మాజీ), వసంత కోకిల (ఊర్వశి), నటరాజ్ (షకలక శంకర్).. ఇలా రకరకాల వ్యక్తులు వస్తారు. వీళ్ళంతా ఎవరు? ఎందుకు రాజా గాడి లైఫ్ లోకి వచ్చారు? వారి రాకతో రాజా గాడి లైఫ్ ఎన్ని మలుపులు తిరిగింది?  చివరికి రాజా సెర్చింగ్ మొదలెట్టిన స్నూపీ ఏమైంది? చివరికి రాజా ప్రేమ ఏమైంది? అనే ప్రశ్నలకి జవాబు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే..

హీరోగా చేసిన శర్వానంద్ పాత్ర రన్ రాజా రన్ తరహాలోనే ఉంది. కానీ ఆ సినిమాలో ఉన్నంత జోష్ లేకపోయినా అదే స్టైల్ యాక్టింగ్ అండ్ డైలాగ్ డెలివరీతో ఓకే అనిపించాడు. ఇక సురభిది చెప్పుకోదగ్గ పాత్ర కాదు.. కానీ తనకున్న రెండు మూడు సీన్స్ బాగా చేసింది. అలాగే పొట్టి పొట్టి బట్టలో బాగా గ్లామర్ అట్రాక్షన్ అయ్యింది. ఇక కమెడియన్స్ లో నెల్లూరు సప్తగిరి మరోసారి తన కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించాడు. ఆ తర్వాత ప్రభాస్ శ్రీను శర్వా మామగా మంచి సెటైర్స్ వేస్తూ నవ్వించాడు. ఇకపోతే సీనియర్ యాక్టర్ ఊర్వశి తన అనుభవం మేర బాగానే చేసారు కానీ తన పాత్రే చెప్పుకోదగ్గా స్థాయిలో లేదు. ఇకపోతే ధనరాజ్, షకలక శంకర్ లు ఒకటి రెండు సీన్స్ లో నవ్వించారు. విలన్స్ గా సుప్రీత్, హరీష్ ఉత్తమన్ లు నెగటివ్ షేడ్స్ బాగానే చేశారు. బ్రహ్మాజీ జస్ట్ ఓకే అనిపించాడు. ఇంకా చెప్పుకోడానికి చాలామంది నటీనటులు ఉన్నా చెప్పుకోదగ్గ పాత్ర ఒక్కటి లేదు.

కథ మాటలు దర్శకత్వం అందించిన మేర్లపాక గాంధీ మొదటి చిత్రం మీద చూపించిన స్థాయిలో కథనం మీద శ్రద్ద తీసుకోలేదు. చిత్రంలో రాసుకున్న ట్విస్ట్ లు బాగానే ఉన్నాయి కాని వాటి చుట్టూ రాసుకున్న సన్నివేశాలలో బలం లేకపోవడంతో ట్విస్ట్ లు కూడా పేలవం గా మారిపోయాయి. బలమయిన పాత్రలు వాటి మధ్య అర్ధవంతమయిన సన్నివేశాలు వాటికి సరయిన సమయంలో మలుపులు ఇది ప్రేక్షకుడు కోరుకునే చిత్రం ఈ చిత్రంలో అన్ని ఉన్నాయి కాని దేనిలోనూ బలం లేదు పాత్రతో కనెక్ట్ కాలేని ప్రేక్షకుడికి రాసుకున్న అరవై సన్నివేశాలు ఆరు గంటలు లా అనిపిస్తాయి. ఈ చిత్రానికి వస్తే  సాయం అని సామజిక అంశం దగ్గర మొదలయ్యి, ప్రేమ కథ గా మారి పతాక సన్నివేశాల వద్ద రివెంజ్ స్టొరీ అయ్యి కూర్చుంది.. ప్రేక్షకుడు హీరో ప్రేమ కథకు కనెక్ట్ అవ్వాలంటే వారి మధ్య ప్రేమను సరిగ్గా చూపెట్టాలి అక్కడే దర్శకుడు గాంధీ విఫలం అయ్యారు. ఒకవేళ ప్రేమకథలో బలం ఉంటె ప్రేక్షకుడు వీళ్ళిద్దరూ ఎలా కలుస్తారు అనే అంశం మీద దృష్టి పెట్టేవాడు.. సింపుల్ గా చెప్పాలంటే ఈ చిత్రం ప్రేక్షకుడికి కథలో లీనమయ్యే అవకాశం కనీసం ఒక్క సన్నివేశంలో కూడా ఇవ్వలేదు.. కార్తీక్ ఘట్టమనేని అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది . ప్రవీణ్ లక్కరాజు అందించిన సంగీతం అసలు బాలేదు నేపధ్య సంగీతం బాగా లౌడ్ గా ఉంది తలపోటు వచ్చేలా చేసింది. పాటలు కూడా అంతంతమాత్రమే .. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది ఇలాంటి కథనం ఉన్న చిత్రానికి రెండు గంటల ఇరవై నిమిషాలు చాలా ఎక్కువ నిడివి. నిర్మాణ విలువలు బాగున్నాయి .. 

ఒక మనిషి జీవితంలో ఒక సంఘటన వల్ల కలిగిన విభిన్న సంఘటనల చుట్టూ రాసుకున్న కథ ఇది,  కథనం కీలకం అయిన చిత్రంలో అసలు కథన బలం లేకపోవడమే ప్రధాన మైనస్ ... హీరో వ్యక్తిత్వం అయినా చూపించాలి హీరోయిన్ పరిస్థితి అయినా పూర్తిగా చూపించాలి.. అది కొంచెం ఇది కొంచెం ఇంకేదో ఇంకొంచెం చూపించి ముగించేసాం అనిపిస్తే ఎలా, చిత్రంలో ఒక్కో పాత్ర పరిచయం అవ్వడం దాని ఫ్లాష్ బ్యాక్ మొదలవడం తిరిగి ప్రస్తుతానికి రావడం సినిమా మొత్తం ఇదే , సరయిన కేంద్రం లేని చిత్రం ఇది , ఉదాహరణగా చెప్పుకుంటే స్వామి రా రా  అనే చిత్రంలో వినాయకుడి విగ్రహం కేంద్రం .. ఇదే దర్శకుడు తెరకెక్కించిన వేంకటాద్రి ఎక్ష్ప్రెస్స్ లో రైలు కేంద్రం వీటి చుట్టూ కథ హీరో హీరోయిన్ అందరు తిరుగుతారు. అదే ఈ చిత్రం విషయానికి వస్తే హీరో , హీరోయిన్ చుట్టూ తిరుగుతుంటాడు కథ కుక్క చుట్టూ తిరుగుతుంటుంది .. కథ హీరోది లేదా హీరోయిన్ ది లేదా కనీసం వారి కుటుంబాలలో ఒకరిది అయినా ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేవాడేమో.. ఒక్క వాక్యంలో చెప్పాలంటే దర్శకుడికి క్లారిటీ లేదు , నటీనటులకు క్లారిటీ గా చెప్పలేదు.. పండగకి ఏదో ఒక చిత్రం కచ్చితంగా చూడాలి అని నిర్ణయించుకుంటే ఒక్కసారి ప్రయత్నించ దగ్గ చిత్రం ... 

Sharwanand,Surabhi,Merlapaka Gandhi,UV Creations,Praveen Lakkarajuఎక్స్ ప్రెస్ రాజా - పట్టాలు తప్పిన రాజా ..

మరింత సమాచారం తెలుసుకోండి: