సంక్రాంతి రోజు విడుదల కాబోతున్న ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాను ప్రమోట్ చేస్తూ ఈరోజు వివిధ తెలుగు పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో అనేక విషయాలను షేర్ చేస్తూ నాగార్జున బాలయ్యతో తాను నటించబోయే మల్టీ స్టారర్ సినిమా విషయం పై క్లారిటీ ఇచ్చాడు. తనకు బాలకృష్ణతో కలిసి నటించాలి అని ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నా సరైన కథ కుదరక ఆ మల్టీ స్టారర్ ప్రారంభం కాలేదు అని చెపుతూ ఇప్పటికి కూడ ఎవరైనా మంచి కథతో తన వద్దకు వస్తే తాను బాలకృష్ణతో కలిసి నటించడానికి రెడీ అంటూ సంకేతాలు ఇచ్చాడు నాగ్.

ఈసారి సంక్రాంతికి బాలకృష్ణ సినిమా పై తన సినిమా పోటీగా వస్తున్న నేపధ్యంలో మళ్ళీ తెర పైకి నందమూరి అక్కినేని వంశాల పోటీ అంటూ వార్తలు వ్రాస్తున్నారని అసలు తాను సినిమాలు నటించడం నిర్మించడం తప్ప హీరోల రేసులో తాను లేనేనని అంటూ కామెంట్ చేసాడు నాగ్. అంతేకాదు గత 50 సంవత్సరాలుగా అక్కినేని నందమూరి కుటుంబాల మధ్య ఎంతో స్నేహం ఉంది అని తెలిసి కూడ ఇటువంటి వార్తలు ఎందుకు వ్రాస్తారో తనకు అర్ధం కాదు అని కామెంట్ చేసాడు నాగ్.

ఇక తన తండ్రి అక్కినేని నాగేశ్వరావు హిట్ పాట అక్కినేని సెంటిమెంట్ వాచ్ పంచే రమ్యకృష్ణ హిట్ కాంబినేషన్ ఇవన్నీ కలిసి తన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాను సూపర్ హిట్ సినిమాగా మారుస్తుందని గట్టి నమ్మకం పై ఉన్నాడు నాగార్జున. తాను వ్యాపార కోణంలో సినిమాను చూడనని డబ్బు సంపాదనే ప్రధాన ధ్యేయం అయితే తాను ఈపాటికే లేక్కలేనన్ని సినిమాలు చేసి ఉండే వాడినని కామెంట్ చేసాడు నాగార్జున.

గత రెండేళ్లలో తెలుగు సినిమా రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయని డిఫరెంట్ సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తారని ‘మనం’, ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ ఘన విజయాలు రుజువు చేశాయని కామెంట్ చేస్తున్నాడు నాగ్. తాను ‘నిర్మలా కాన్వెంట్’ అనే చిన్న సినిమాను నిర్మిస్తున్నానని అందులో తాను కూడ ఒక కీలక పాత్రను పోషిస్తున్నాను అని చెపుతున్న నాగ్ కొత్త తరం ఆలోచనలతో మారకపోతే శాస్వితంగా వెనక పడిపోతాం అంటూ నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేసాడు..



మరింత సమాచారం తెలుసుకోండి: