నాగార్జున తన పిల్లలు నాగచైతన్య అఖిల్ ల గురించి ఎంతగానో ఆలోచిస్తున్న కొద్ది ఏదో రూపంలో అఖిల్ ను దురదృష్టం వెంటాడుతూ ఉండటం చాల మందిని ఆశ్చర్య పరుస్తోంది. తోలి సినిమా ఫెయిల్ అయినా అఖిల్ మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్న విషయం  తెలిసిందే. తన టాలెంట్ ను మరింత మెరుగు పరుచుకుని దక్షిణాది సినిమా రంగ ప్రముఖలు చూపెట్టడానికి ‘ఐఫా’ వేడుకని వేదికగా తీసుకుని తొలి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. 

దీనికోసం మూడు రోజుల ముందు నుంచే రిహార్సల్స్ చేసి వేదికపైన కూడా అదరగొట్టాలని డిసైడ్ అయ్యాడు అఖిల్. అయితే ఎంతో జోష్ తో ‘ఐఫా’ వేదిక పైకి వచ్చిన అఖిల్ కు అక్కడ కూడ దురదృష్టం వెంటాడింది అన్న వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం అఖిల్ లైవ్ డాన్స్ ప్రోగ్రామ్  అనుకొన్నంతగా వర్కవుట్ అవ్వలేదు అన్న వార్తలు వస్తున్నాయి. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడంతో అఖిల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ లో కొన్ని అనుకోని సమస్యలు వచ్చాయి అని టాక్. 

రెండు మూడు పాటలు రీమిక్స్  చేసి  అఖిల్ డాన్స్ చేస్తున్నప్పుడు ఆ పాటల  ప్లే కొంత సేపు ఆగిపోవడంతో గందరగోళం ఏర్పడంతో స్టెప్పులు కుదరక అఖిల్ కొంత సేపు ఆగి పోయినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ అన్నీ సరిచేసి పాటని ప్లే చేశారు అని తెలుస్తోంది. కానీ అప్పుడు కూడా డిస్టర్బెన్స్  వచ్చింది అని టాక్. 

దీనితో అఖిల్ కాస్త నిరుత్సాహ పడినట్లు తెలుస్తోంది. దీనితో తొలి లైవ్ షోలో అఖిల్ కి ఈరకంగా ఒక చేదు అనుభవాన్ని ఇచ్చింది అన్న కామెంట్స్ వినిపించాయి.  కానీ అఖిల్ డాన్స్  చేసినంతసేపు మాత్రం అదరగ్గొట్టేశాడని ఆ కార్యక్రమానికి వచ్చిన అతిధులు మాట్లాడుకోవడం వినిపించింది..



మరింత సమాచారం తెలుసుకోండి: