చాల కాలం తరువాత మన ఇండియన్ క్రికెట్ టీమ్ తన సత్తాను చాటింది. ఆస్ట్రేలియాలో జరిగిన టి-20 క్రికెట్ సిరీస్ లో భారత ఆస్ట్రేలియా పై వరస విజయాలు సాధించి 3-0 తో ఈ సిరీస్ ను సొంతం చేసుకోవడంతో ఇండియాలోని క్రికెట్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. నిన్న జరిగిన ఆఖరి మ్యాచ్ ని బుల్లితెర పై దాదాపు 30 లక్షల మంది చూసారు అంటే ఈ సిరీస్ మన ఇండియన్ యూత్ ను ఎంతగా ఆకర్షించిందో అర్ధం అవుతుంది.

ఆస్ట్రేలియా సిడ్నీలో జరిగిన ఈ ఆఖరి మ్యాచ్ ని చూడటానికి ఆ దేశంలోని మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడ అనేకమంది వచ్చారు. అయితే ఈ మ్యాచ్ లో పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పోస్టర్స్ కూడ కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. పవన్ సర్దార్ పోస్టర్ పై ‘గట్స్ గన్స్ లవ్’ అన్న పదాలు కనిపిస్తే క్రికెటర్ విరాట్ కోహ్లి పోస్టర్ కింద ‘బాల్ బ్యాట్, లవ్’ అన్న పదాలు కనిపించాయి. ఈ ఇద్దరి సెలెబ్రెటీల ఫోటోలతో పవన్ అభిమానులు చేసిన హంగామా నిన్నటి సిడ్నీ మ్యాచ్ కి హాట్ టాపిక్ గా మారింది.

ఈ క్రికెట్ మ్యాచ్ లో పవన్ అభిమానుల సందడి బట్టి ‘సర్దార్’ సినిమా కోసం ఎంత ఆత్రంగా ఎదురు చూస్తున్నారో  అర్ధం అవుతుంది. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమా హక్కులను సంపాదించుకున్న ఈరోస్ సంస్థ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాను కొనడానికి ఆ శక్తి చూపుతున్న బయ్యర్లకు చుక్కలు చూపెడుతోంది అని టాక్. దీనికి కారణం ఈ సినిమాకు ఏర్పడిన క్రేజ్ రీత్యా కనివిని ఎరుగని రేట్లను బయ్యర్లకు ఈరోస్ సంస్థ కోట్ చేస్తోంది అని టాక్.

ఈ వార్తలతో బెంబేలు పడుతున్న బయ్యర్లు అంత భారీ రేట్లకు ఈసినిమాను కొని రిస్క్ చేయడం కంటే కొనకుండా దూరంగా ఉండటమే మంచిది అన్న సంకేతాలు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాలు ఏమి పట్టించుకోకుండా ఈసినిమా విషయంలో ఈరోస్ సంస్థ అదేవిధంగా నిర్మాత శరత్ మరార్ పడుతున్న మొండి పట్టుదల వల్ల ఈసినిమా మార్కెట్ కు అసలుకు మోసం వస్తుందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి..  
 


మరింత సమాచారం తెలుసుకోండి: