తెలుగు ఇండస్ట్రీలోకి ‘హ్యాపీడేస్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మిల్కీబ్యూటీ తమన్న తర్వాత రాంచరణ్ నటించిన రచ్చ చిత్రంతో బాగా ఫేమస్ అయ్యింది. ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరిక్షించుకున్నప్పటికీ అక్కడ అంత సక్సెస్ కాలేక పోయింది. దీంతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలే బెటర్ అనుకొని ఇక్కడే సెటిల్ అయ్యింది. గత సంవత్సరం దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రంలో అవంతిక పాత్రతో తన అందాలు ఆరబోసింది.

ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే..దీంతో ఈ అమ్మడికి ఆఫర్లు బాగానే వస్తున్నాయి. తమన్న కేవలం హీరోయిన్ గా నే కాకుండా ఐటమ్ సాంగ్స్ తో కూడా బాగా పాపులర్ అయ్యింది..ఆ మద్య వచ్చిన ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’ చిత్రాల్లో ఐటమ్ సాంగ్ లో దుమ్మురేపింది. ఇక ఆ మద్య రవితేజతో బెంగాల్ టైగర్ సినిమాలో కూడా తన అందాలతో కుర్రకారు మనసు దోచేసింది..ప్రస్తుతం హీరోయన్ గా ఐటమ్స్ సాంగ్స్ తో కెరీర్ కొనసాగిస్తున్న తమన్న జీవితంలో ఓ షాకింగ్ న్యూస్ జరిగినట్లు తెలిపింది.  సాధారణంగా అమ్మాయిల వెంట పడుతున్న కుర్రాళ్లను సమయం చూసి అన్నయ్య అంటే ఎలా ఉంటుందో..ఈ అమ్మడికి కూడా అలాంటీ షాకే తగిలిందట.

బాహుబలి చిత్రంలో ప్రభాస్, తమన్నా


తాను చదువుకునే రోజుల్లో తన స్నేహితురాలు వాళ్ల అన్నయ్య చాలా అందంగా ఉండేవాడట దాంతో అతన్ని చాలా ఇష్టపడిందట. తానను పదే పదే చూడాలనిపించి తన స్నేహితురాలు లేకున్నా అతనితో మాట్లాడి వచ్చేదట. ఇలా ఓ టైమ్ చూసి తన మనసులో ఉన్న మాట చెప్పాలని ఫిక్స్ అయిన ఈ అమ్మడు అతనితో చెప్పడంతో నువ్వు నా చెల్లెలిలాంటి దానివి అనడంతో గుండెపగిలినంత పనైందట. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న ఈ అమ్మడు అప్పటి నుంచి వేరే అబ్బాయి జోలికే వెళ్ళలేదట.


మరింత సమాచారం తెలుసుకోండి: