టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరుగానే కాకుండా టాలీవుడ్ ను శాసించే ఆ నలుగురులో ఒకరుగా అల్లు అరవింద్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదిగిన సంగతి తెలిసిందే. తన గీత ఆర్ట్స్ పై ఎన్నో భారీ సినిమాలు తీసిన అల్లు అరవిoద్ ఈ సారి చాలా గ్యాప్ తరువాత తన కొడుకును బన్నీని హీరోగా చేసి తీస్తున్న ‘సరైనోడు’ సినిమా భారీ కలక్షన్స్ వసూలు చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసి తన పలుకుబడి అంతా ఉపయోగించి తన విశ్వరూపం చూపించబోతున్నాడు.  

టార్గెట్ 70 కోట్లు కలక్షన్స్ గా ధ్యేయంతో అల్లుఅర్జున్ ను టాప్ వన్ స్థానంలో హీరోగా నిలబెట్టడానికి  ‘సరైనోడు’ సినిమా ద్వారా మాస్టర్ స్కెచ్ లు వేస్తున్నాడు అల్లు అరవింద్. ఈ సినిమా ఫస్ట్ టీజర్ రేపు శుక్రవారం విడుదదల చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, బెంగుళూరు ఏరియాల్లో ఉన్న దాదాపు 1000 థియేటర్లలో ఈ టీజర్ ప్రదర్శించబోతున్నారు. 

ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఒక టీజర్ ను ఇంత భారీ స్థాయిలో విడుదల చేసిన సందర్భాలు గతంలో లేవు. బన్నీ మాస్ అవతారాన్ని చూపెట్టబోయే ఈ టీజర్ లో బన్నీ చెప్పిన పంచ్ డైలాగ్స్ బయటకి లీక్ అయ్యాయి. ‘తెల్లతోలు ఉందని క్లాస్ అనుకున్నావేమో, మాస్ పక్కా మాస్’ అనే డైలాగ్ ను బన్నీ తన స్టైల్ లో మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చెప్పబోతున్నాడు. 

మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే  ‘శ్రీమంతుడు’ సినిమాలో మహేష్ బాబు ఒక రౌడీని తన రెండు చేతులతో ఎత్తి కింద పడేస్తే ఈసినిమాలో బన్నీ తన సినిమా ‘సరైనోడు’ లో ఒక రౌడీని ఒక చేతితో పైకెత్తి కింద పడేయడం ఈ టీజర్ కు పైలెట్ గా మారుతుంది అని అంటున్నారు. దీనిని బట్టి చూస్తూ ఉంటే బన్నీ మహేష్ బాడీ లాంగ్వేజ్ మీదనే కాదు ‘శ్రీమంతుడు’ రికార్డుల పై కూడ కన్నేశాడు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: