చిరంజీవి మేనల్లుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలో తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరుచుకుని దూసుకు పోతున్న సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ నిర్ణయం మెగా కాంపౌండ్ కు మరొకసారి షాక్ ఇచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి. చిరంజీవి మెగా స్టార్ కాకముందు అతడి అభిమానులు పిలుచుకున్న ‘సుప్రీమ్’ టైటిల్ తో ప్రస్తుతం సినిమాను చేస్తున్న సాయిధరమ్ తేజ్ ఈసారి ఏకంగా చిరంజీవికి మెగా స్టార్ హోదాను క్రియేట్ చేసిన ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ పై కన్నేసాడు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలలో ‘గ్యాంగ్ లీడర్’ కలక్షన్స్ మాత్రమే కాదు ఆ సినిమా  విజయోత్సవ వేడుకలు ఇప్పటికీ చిరు ఫ్యాన్స్ కు ఓ మధుర ఘట్టంగా నిలిచిపోతాయి. అలాంటి సినిమా టైటిల్ ను వాడేసుకోవాలని సాయి ధరమ్ తేజ్ చేస్తున్న ప్రయత్నాలు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. ‘ఠాగూర్’ మధు, నల్లమలపు బుజ్జి కలిసి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిర్మించే కొత్త సినిమాలో సాయి ధరమ్ తేజ హీరోగా నటించబోతున్నాడు. 

ఈ సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు ఫిలింనగర్ టాక్. అయితే ఇటువంటి నిర్ణయం చిరంజీవి అంగీకారం లేకుండా జరగని పని. ఈ విషయం ఇప్పటికి చిరంజీవి దృష్టికి రాలేదు అని అంటున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రీతి పాత్రమైన ఈ టైటిల్ ను సాయిధరమ్ తేజ్ కు ఇచ్చే విషయంలో చిరంజీవి తన అంగీకారాన్ని తెలియ చేస్తాడా అన్నదే ప్రశ్న. 

ఇప్పటికే మెగా స్టార్ ఇమేజ్ ను చాలామంది మెగా యంగ్ హీరోలు కబ్జా చేస్తున్నారు అని కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో సాయిధరమ్ తేజ్ కోరిక తీరే అవకాశం లేదు అని అంటున్నారు. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ టైటిల్ విషయం బయటకు లీక్ కావడంతో సాయి ధరమ్ తేజ్ కు ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ ఏమిటి అంటూ వెబ్ మీడియాలో సాయి ధరమ్ తేజ్ ను టార్గెట్ చేస్తూ కొందరు కామెంట్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: