మొదటి 10 నిమిషాలు , నేపధ్య సంగీతంమొదటి 10 నిమిషాలు , నేపధ్య సంగీతంచిరాకు పెట్టేలా రాసుకున్న కథ , బోరింగ్ నేరేషన్ , ఎడిటింగ్ , నో హర్రర్, నో థ్రిల్స్ , యాక్టర్స్ పెర్ఫార్మన్స్ , కథకి అవసరంలేని ఎన్నో సీన్స్ , ఇరికించిన పాటలు , వీక్ డైరెక్షన్

ఎలాంటి పనీ పాటా లేని కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేయాలో తెలియక ఆత్మల్ని రప్పించి వాటితో మాట్లాడాలి అనుకుంటారు. అలా అనుకోని మౌనిక(దీక్ష పంత్) తన బాయ్ ఫ్రెండ్ కళ్యాణ్(ఆశిష్)లు కలిసి తన ఫ్రెండ్స్ ని కూడా తీసుకొని తన ఆత్మల ప్లాన్ వర్కౌట్ చేయడానికి ఒక స్పెషల్ హౌస్ కి వెళ్తారు. ఇక కథ మౌనిక కి ఓ బుక్ పబ్లిషింగ్ సంస్థ 1992లో మొదలై మధ్యలో ఆగిపోయిన 'ఓ స్త్రీ రేపు రా' అనే బుక్ ని కంప్లీట్ చేయమని చెప్తారు. ఆ బుక్ కథ ఏంటి అంటే.. ఒక దెయ్యం రాత్రి వేళల్లో ఆ బంగ్లా దగ్గరికి వచ్చి తనకి కావలసిన వాళ్ళని తన మాటలతో బయటకి రప్పించి వాళ్ళను చంపడం లేదా వాళ్ళని ఏమన్నా చేయడం లాంటివి చేస్తుంటుంది. దైవీక శక్తులను తెలిపే బోర్డు ద్వార దీక్ష, కళ్యాణ్ 1990లకు చెందిన కళ్యాణి(శృతి మోల్)ని రప్పిస్తారు. తన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే.. కథ అంబపురం విలేజ్ లో మొదలవుతుంది. కళ్యాణి ఆ ఊరు జమిందార్ కొడుకు శ్రీనుని ప్రేమిస్తుంది. ఇద్దరు కలిసి కొత్త జీవితం మొదలు పెట్టాలనుకుంటున్నప్పుడు కళ్యాణిని చంపేస్తారు. అంతే కాకుండా కళ్యాణిపై లేని పోనే చెడు పుకార్లను పుట్టిస్తారు. దాంతో కళ్యాణి అంబపురం విలేజ్ వాసులని చంపుతూ ఉంటుంది.. ఇక అక్కడి నుంచి కళ్యాణి వల్ల మౌనిక అండ్ బాచ్ ఎలాంటి సంఘటనలను ఎదుర్కున్నారు? ఫైనల్ గా ఓ స్త్రీ రేపు రా బుక్ కంప్లీట్ చేసారా లేదా? కళ్యాణి ఆత్మ శాంతించిందా? లేదా? అనేది వెండితెరపై చూసి తెలుసుకోండి..  

ఫీమేల్ విలన్ గా, ఆత్మగా కళ్యాణి పాత్రలో కనిపించిన శృతి మోల్ చూడటానికి బాగుంది, అలాగే పెర్ఫార్మన్స్ పరంగా ఓకే అనిపించింది. తన పాత్రలో పెద్దగా నటనకు ఆస్కారం లేకపోవడం వలన ఓకే ఓకే గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మెయిన్ రోల్స్ లో కనిపించిన దీక్ష పంత్, ఆశిష్, వంశీ కృష్ణ, కునాల్ కౌశిక్ లు తమ నటనతో ప్రేక్షకులని బెదరగొట్టారని చెప్పాలి. వాళ్ళ నటన ఇర్రిటేట్ చేస్తుంది. పోతే దీక్ష పంత్ అక్కడక్కడా అందాల ఆరబోత మాత్రం బాగానే చేసింది. మిగతా చిన్న చిన్న పాత్రలు చేసిన వారు ఓకే అనిపించారు. 

హర్రర్ కామెడీ అనే జానర్లో నాలుగు సినిమాలు హిట్ అవ్వడం వలన అదే జానర్లో వరుస బెట్టి సినిమాలు వస్తూనే ఉన్నాయి. అలాగే ఇప్పటికే చెప్పలేనన్ని సార్లు ఎంతోమంది దర్శకులు అటెంప్ట్ చేసిన అదే పాత కథని తీసుకొని సానికి 1992 నాటి యాదర్త సంఘటనలు అనే రంగుని పూసి చేసిన సినిమానే ఓ స్త్రీ రేపు రా. అందులోనూ ఇలాంటి కథలని మన జానపదాల్లో, లేదా మన అమ్మమ్మలు కథలుగా చెప్పినప్పుడే వినేసి ఉంటాం. షార్ట్ ఫిల్మ్స్ నుంచి ప్రమోషన్ తీసుకుంటూ అశోక్ రెడ్డి చేసిన మొదటి ఫీచర్ ఫిల్మ్ అయిన ఎ సినిమాని మన ఫేమస్ తెలుగు జానపద కథల ఫార్మాట్ లో మల్టిపుల్ సబ్ ప్లాట్స్ తీసుకొని చెప్పాడు. సినిమా మొత్తం ప్రస్తుత కాలం - భూత కాలం అనే ఫార్మాట్ లోనే సాగుతుంది. చూసే ఆడియన్స్ కి భయాన్ని, షాక్ ని కలిగించాలి అనుకొని రాసుకున్న సీన్స్ అన్నీ చాలా సింపుల్ గా ఉన్నాయి. ఎన్నో హర్రర్ సినిమాలను చూసిన తెలుగు ప్రేక్షకులను ఈ థ్రిల్స్ అస్సలు బయపెట్టలేక పోయాయి. దాంతో ఆడియన్స్ బాగా బోర్ ఫీల్ అవ్వడమే కాకుండా ఓ స్టేజ్ లో టార్చర్ రా బాబు అనే ఫీలింగ్ కి కూడా వస్తారు. కథలోని అంశాలు ఏవీ ఆడియన్స్ ని కన్విన్స్ చేసేలా లేవు. చెప్పడానికి బాగానే లూప్ హోల్స్ ఉన్నాయి. మచ్చుకకి ఒకటి వదులుతా.. లీడ్ యాక్టర్స్ ఆత్మలను రప్పించాలని కాయిన్ తో ఆమె ఆడాక రాకపోవడంతో ఓ స్త్రీ రేపు రా అనేది అందరి మూడనమ్మకం తప్ప నిజం కాదని ఒకతను చెప్తాడు. ఆ ఆత్మ అప్పుడు రాకుండా మరుసరి రోజు ఎందుకు వచ్చిందో అర్థం కాదు.. ఆలాంటప్పుడు ఓ స్త్రీ ఎప్పుడూ రాకు అనే టైటిల్ పెట్టుకోవాల్సింది. 



కథా పరంగా సినిమా మొదటి నుంచి చివరి దాకా ఎక్కడా మిమ్మల్ని థ్రిల్ చేసేలా ముందుకు సాగదు. ఒక స్టేజ్ తరవా మీ సహనానికి పెద్ద పరీక్షగా మారడమే కాకండా, అనవసరమైన వాటికంతా దీటైలింగ్ ఇచ్చి చిరాకు పెట్టారు.కావున ఎక్కడా ఆడియన్స్ ఎంజాయ్ చేయడానికి స్కోప్ లేదు. జివి అందించియా మ్యూజిక్ ఒక రేడు పాటలకి బాగుంది, పాటలని పక్కన పెడితే నేపధ్య సంగీతం మాత్రం సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయ్యింది. మనోహర్ - హరినాథ్ సినిమాటోగ్రఫీ బాగుంది.  మెయిన్ గా అతను మాటకోసారి ఫ్లాష్ కట్స్ వేసి చిరాకు పుట్టించేసాడు. రీడింగ్ లాంప్ క్రియేషన్స్ వారి నిర్మాణ విలువలు ఓకే ఒకే అనేలా ఉన్నాయి. 


హర్రర్ థ్రిల్లర్ గా వచ్చిన 'ఓ స్త్రీ రేపు రా' సినిమా హిఎతర్స్ కి వచ్చిన ఆడియన్స్ ని థ్రిల్ చేయడంలో ఫెయిల్ అయ్యింది, ఇక భయపెత్తడంలో అయితే డిజాస్టర్ అయ్యింది. అంతేకాక ఇంట వరస్ట్ గా ఘోస్ట్ సీన్స్ రాసుకుంటారా అని తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక క్లైమాక్స్ కోసం ఏదో ట్విస్ట్ దాసి పెడుతున్నాం అనే ఫీలింగ్ లో ఉంచిన ట్విస్ట్ ని మనం సినిమా మొదట్లోనే ఊహించేయగలం. ఇక నటీనటుల నుంచి కూడా బాడ్ పెర్ఫార్మన్స్ రావడంతో ఆడియన్స్ ఏ విధంగానూ ప్రశాంతత ఉండదు. కావున ఈ సినిమా మీ జేబుకి చిల్లు పెట్టడమే కాకుండా మీకు తలనొప్పి కూడా తెచ్చి పెట్టే సినిమా అవుతుంది. 

Diksha Panth,Ashok Reddy,Ghantasala Viswanathఓ స్త్రీ రేపు రా - ఓ స్త్రీ.. ప్రేక్షకులు రారు.!

మరింత సమాచారం తెలుసుకోండి: