ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి యాంకర్ సుమ పేరు తెలియని వారుండరు. గత 23 సంవత్సరాలుగా బుల్లితెరను ఏలుతున్న యాంకర్ సుమ ఆరోగ్యం పై వెబ్ మీడియాలో కనిపిస్తున్న వార్తలు సుమ అభిమానులను టెన్షన్ పెడుతున్నాయి. సుమ గత కొన్ని రోజులుగా ఆమె గొంతు సంబంధమైన ఇబ్బందితో బాధ పడుతున్నట్లు సమాచారం. 

సుమ యాంకరింగ్ ఇలానే కొనసాగిస్తే సుమ మరింత ఇబ్బందుల్లో పడుతుందని, పర్మినెంటుగా వాయిస్ లో మార్పులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు ఆమెను హెచ్చరించినట్లు వార్తలు వెబ్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ఈ  సమాచారం చదివిన అభిమానులు మాత్రం తెగ టెన్షన్ పడిపోతున్నారు. 

గతంలో సుమ అనేక బుల్లితెర షోలకు విరామం లేకుండా యాంకరింగ్ చేయడం వల్ల తన గొంతు దెబ్బ తింటోంది అని ఆమె తనపై తానే ఒక ప్రోగ్రాంలో జోక్ చేసుకుంది. అయితే ఆ వార్తలకు కొనసాగింపుగా ఈ గాసిప్పులు పుట్టుకు వచ్చాయా లేదంటే నిజంగానే సుమకు గొంతు సంబంధించిన అనారోగ్య సమస్యలు పెరిగాయా అనే విషయం పై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

600ల ఆడియో విడుదల కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న ‘స్టార్ మహిళ’ కార్యక్రమాన్ని 2వేలకు పైగా ఎపిసోడ్స్ కు యాంకరింగ్ చేసిన సుమ  లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఒక టాప్ సెలెబ్రెటీ స్టేటస్ లో కొనసాగుతున్న ఈమె ఆరోగ్యం పై వస్తున్న గాసిప్పులు అందరికీ షాక్ ఇవ్వడమే కాకుండా సుమ అభిమానులను కలవర పెడుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: