యంగ్ హీరో నాగచైతన్యకు తెలుగు దర్శకులు అన్నా వారు చెపుతున్న కథల పైనా నమ్మకం పోయింది అంటూ ఫిలింనగర్ లో వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఈ వార్తలు ఇలా రావడానికి గల కారణం చైతూకు కథ చెప్పటానికి వెళ్లే తెలుగు దర్శకుల పై చైతన్య ఇంట్రస్ట్ చూపటం లేదని ఫిలింనగర్ గాసిప్. అంతేకాదు ప్రస్తుతం సినిమాలలో నటించడానికి తన వద్ద డేట్స్ లేవు అని అంటూ చైతన్య తెలివిగా తెలుగు దర్శకుల నుండి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. 

దీనికి కారణం ఈ అక్కినేని యంగ్ హీరో దృష్టి అంతా ఇప్పుడు తమిళ మలయాళ దర్శకుల పైనే ఉంది అని అంటున్నారు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ తో సినిమా చేస్తున్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ తర్వాత నాగ చైతన్య మరో తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ తో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

అంతేకాకుండా ఈమధ్య చైతన్యను మరో ఇద్దరు తమిళ యువ దర్శకులు కలిసి కథలు చెప్పినట్లు తెలుస్తోంది. చైతూ లేటెస్ట్ గా చేస్తున్న ‘ప్రేమమ్’ సినిమాకు మళాయళంలో సూపర్ హిట్టైన టైటిల్ నే కొనసాగించడం వెనుక తెలుగు కథలన్నా తెలుగు టైటిల్స్ అన్నా చైతన్యకు ఏర్పడిన భయం అని అంటున్నారు. దీనిని బట్టి చూస్తూ ఉంటే నాగచైతన్య రానున్న రోజులలో తమిళ స్టార్ డైరక్టర్స్ కు అదేవిధంగా రీమేక్ సినిమాలకు పరిమితం అయిపోతాడ అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

దీనికి కారణం తెలుగు స్టార్ డైరెక్టర్స్ ఎవరూ నాగాచైతన్యను పట్టించుకోకపోవడంతో ఆ కోపం తెలుగు దర్శకులు  అందరి పైన చూపెడుతున్నాడు అన్న కామెంట్స్ ఉన్నాయి. ఇదిఇలా ఉండగా డైరక్టర్ కళ్యాణ కృష్ణతో చైతూ ఒక సినిమా చేయడానికి కమిట్ అవ్వడానికి గల కారణం తండ్రి నాగార్జున ఒత్తిడి అన్నమాటలు వినిపిస్తున్నాయి. ఏమైనా ‘ప్రేమమ్’ విడుదల తరువాత చైతన్య పర భాష సినిమాల మోజు ఇంకా పెరిగి పోతుందా లేక తరిగి పోతుందా అన్న విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: