టాలీవుడ్ ఇండస్ట్రీలో గత సంవత్సరం బాహుబలి ట్రెండ్ కొనసాగించింది..విడుదలైన తర్వాత ఎవ్వరూ ఊహించనంతగా సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో కనీ వినీ ఎరుగని రీతిలో 600 కోట్లు కలెక్షన్లు సాధించడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంతటి ఘనకీర్తి సంపాదించిందీ అంటే దాని వెనుక చిత్రయూనిట్ శ్రమ ఒక ఎత్తైతే..సోషల్ మీడియా పబ్లిసిటి మరో ఎత్తు. బాహుబలి చిత్రం తర్వాత మీడియాలో ఆ రేంజిల్ పబ్లిసిటి చేసుకున్న చిత్రం రుద్రమదేవి...ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

తాజాగా ఇదే ట్రెండ్ కొనసాగిస్తూ పవర్ స్టార్ నటిస్తున్న పవన్ కళ్యాన్ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సోషల్ మిడియాలో క్రియేట్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ కి మరో మూడు వారాలు మాత్రమే టైం ఉంది. ఇంకా ఐదు రోజుల్లో పవర్ స్టార్ సినిమా ఆడియో ఫంక్షన్ కూడా జరగనుంది. తాజాగా రిలీజ్ అయిన మేకింగ్ వీడియో ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పటికే సర్దార్ గబ్బర్ సింగ్ కి అన్ని ఏరియాల బిజినెస్ పూర్తయిపోయింది. సర్దార్ గబ్బర్ సింగ్ కి నైజాంలో వచ్చిన మొత్తం 21 కోట్లు. సీడెడ్ 10.44 కోట్లు నెల్లూరు 2.70 కోట్లు కృష్ణా 4.05 కోట్లు గుంటూరు 5.40 కోట్లు వైజాగ్ 7.20 కోట్లు తూర్పు గోదావరి 5.40 కోట్లు పశ్చిమ గోదావరి 4.05 కోట్లు కర్నాటక మరియు రెస్టాఫ్ ఇండియా 9 కోట్లు బిజినెస్ చేయగా.. ఓవర్సీర్ రైట్స్ రూపంలో 11  కోట్లు వచ్చాయి.

‘సర్ధార్ ’ షూటింగ్ లో ఫైట్ మాస్టర్స్,దర్శకుడితో పవన్ కళ్యాన్



మొత్తం సర్దార్ గబ్బర్ సింగ్ ప్రి రిలీజ్ బిజినెస్ లెక్క 80.24 కోట్లు.  ఇక ఆడియో ఆడియో ఫంక్షన్ టెలికాస్ట్ శాటిలైట్ హక్కులను కూడా కలిపితే మొత్తం లెక్క 105 కోట్లుగా దాటిపోయే అవకాశం ఉంది. మొత్తానికి విడుదలకు ముందే బాక్సాఫీస్ దగ్గర తన పవర్ ఏంటో చెప్పేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక ఏప్రిల్ 8నుంచి థియేటర్ల దగ్గర హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: