అనీష అంబ్రోస్ క్యూట్ లుక్స్ , అదుర్స్ అనేలా ఉన్న సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అనీష అంబ్రోస్ క్యూట్ లుక్స్ , అదుర్స్ అనేలా ఉన్న సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు మార్పులు చేర్పులతో కూడిన స్టొరీ, కథనంలో బోరింగ్, డెడ్ స్లో నెరేషన్, సాగుతూ సాగుతూ ఇబ్బంది పెట్టే సెకండాఫ్, ఎడిటింగ్, కొన్ని పాత్రలకి సెట్ కాని నటీనటుల ఎంపిక, విలన్ ని ఫూల్ చేసేలా తెలుగు స్క్రిప్ట్ ఉండడం

"మామూలుగా మనకు ఏం బాడ్ జరిగినా 'టైం బాడ్' లేదా 'అస్సలు టైం బాలేదు' అంటాం, అలాగే ఎవడికన్నా మంచి జరిగితే 'వాడి టైం' మస్త్ ఉంది అని పెదవి విరుస్తూ ఉంటాం.. ఇదే 'టైం'ని బేస్ చేసుకొని ఒక సామాన్యమైన  టైం తెచ్చిన మార్పు ఎంటనేదే ఈ 'రన్' సినిమా". 


ఇక అసలు కథలోకి వెళితే.. ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని కొత్త జాబ్ కోసం వెతికే ప్రయత్నంలో ఉన్న కుర్రాడే మన హీరో సంజు (సందీప్ కిషన్). సంజు తన చిన్ననాటి స్నేహితురాలైన అమూల్య(అనీష అంబ్రోస్)తో ప్రేమలో ఉంటాడు. వీరిద్దరికీ ఇష్టమైనా సంజుకి జాబ్ లేదనే కారణంగా అమూల్య ఫాదర్ శ్రీనివాసులు గారు(కాశీ విశ్వనాథ్) వీరి పెళ్ళికి ఒప్పుకోడు. ఇదలా ఉంచితే.. డబ్బు వడ్డీకి ఇస్తాడు, కానీ చెప్పిన టైంకి వడ్డీతో సహా డబ్బు ఇవ్వకపోతే వడ్డీ ఇవ్వని వాడి ప్రాణాలు తీసి, వాడి పార్ట్స్ అమ్ముకునైనా తన అప్పు వసూలు చేసుకునే కిరాతకుడే వడ్డీ రాజు(బాబీ సింహా). ఇతనే మన సినిమాకి విలన్.. సంజు తన చెల్లి పెళ్లి కోసం అత్యవసరం మీద వడ్డీ రాజు దగ్గర అప్పు తీసుకుంటాడు. కట్ చేస్తే డబ్బు తిరిగి ఇవ్వాల్సిన టైం వస్తుంది. సంజు డబ్బుతో బయలుదేరుతాడు. అదే టైంలో రెండు ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అవే అమూల్య సంజు కోసం ఇంటి నుంచి వచ్చేయడం మరియు సంజు దగ్గర ఉన్న డబ్బుని ఒక దొంగల బాచ్ కొట్టేయడం. ఇక అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపులు తిరిగింది.? సంజు ఒకే టైంలో దొంగలు కొట్టేసిన డబ్బుని దక్కించుకోవడం కోసం ఏం చేసాడు?  అమూల్యని ఎలా దక్కించుకున్నాడు? అదే టైంలో వడ్డీ రాజు డబ్బు కోసం సంజుని ఎలాంటి ఇబ్బందుల్లో తోసాడు? అన్నదే  వెండితరపై చూసి తెలుసుకోవాల్సిన కథ.  


ముందుగా సినిమాకి హీరో అయిన సందీప్ కిషన్ విషయానికి వస్తే.. చూడటానికి చాలా సైలెంట్ గా కనిపిస్తూ, ఏమీ తెలియనట్టే చేసేవన్నీ చేసేసే టైపు పాత్రలో సందీప్ కిషన్ కనిపించాడు. కాస్త అండర్ ప్లే చేసే ఈ పాత్రని అసలు  చేయలేకపోయాడు. కొన్ని చోట్ల కావాల్సిన దానికన్నా ఎక్కువ చేస్తే, కొన్ని చోట్ల అవసరమైన ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వలేక తేలిపోయాడు. అండర్ ప్లే చేయమంటే ఓవరాక్షన్ చేసాడు. ఓవరాల్ గా జస్ట్ ఓకే ఏదో చేసాడులే అనేలా నటించాడు తప్ప గొప్పగా ఏమీ చేయలేదు మన హీరో సందీప్ కిషన్. అనీష అంబ్రోస్ మాత్రం లుక్స్ పరంగా చాలా క్యూట్ క్యూట్ గా ఉంది. అలాగే లవ్ సీన్స్ లో హావ భావాలను బాగా పలికించింది. కానీ సినిమాలో తనకి పెద్దగా పాత్ర లేకపోవడం వలన ఎక్కువ సేపు తెరపై కనిపించలేకపోయింది. ఇక సినిమాకి కీలకమైన పాత్ర చేసింది బాబీ సింహా.. తమిళ వెర్షన్ లో చేసిన పాత్రని మళ్ళీ  చేయడంలో చాలా వరకూ సక్సెస్ అయ్యాడు బాబీ సింహా(ఒరిజినల్ వెర్షన్ చూసిన వారికైతే తమిళ్ లోనే బాగా చేసాడు అనిపిస్తుంది). తన పాత్ర, పెర్ఫార్మన్స్ రెండు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకున్నాడు, అదే పర్ఫెక్ట్ గా సింక్ అవ్వలేదు. చాలా వరకూ తమిళ యాస కనిపిస్తుంది. ఆ విషయంలో కేర్ తీసుకోవాల్సింది. అమ్మాయిని ఫ్లర్ట్ చేసే పాత్రలో మహాత్ రాఘవేంద్ర ఓకే అనిపించాడు. ఇక ఎస్.ఐ పద్మావతిగా బ్రహ్మాజీ, కాశీ విశ్వనాథ్, పోసాని కృష్ణమురళిలు అక్కడక్కడా నవ్వించారు. దొంగలుగా చేసిన శని, సుదర్శన్ లు ఓకే అనిపించారు. కానీ వీరిని దొంగలుగా చూపించడం సినిమాలో నమ్మశక్యంగా లేదు. ప్రవీణ్, మధులు తమ పాత్రలకి న్యాయం చేసి వెళ్ళారు.   

తమిళ, మలయాళ భాషల్లో రూపొంది 2013 సమ్మర్ రిలీజ్ గా విడుదలై సమ్మర్ హిట్  'నేరం' సినిమాకి అధికారిక రీమేక్ గా రూపొందిన సినిమానే 'రన్'. ఈ సినిమా రీమేక్ కూడా 2 ఏళ్ళ తర్వాత సమ్మర్ సీజన్లో రిలీజ్ కావడం విశేషం. ఇక రీమేక్ అనగానే మన తెలుగులో చేసే మొదటి తప్పు.. అందులోని ఒరిజినల్ ఫీల్ ని వదిలేసి ఇక్కడి ఆడియన్స్ అలా చూడరు, ఇలా చూడరు అని చెప్పి కమర్షియల్ అంశాలను బాగా దట్టించడం, కామెడీని జత చేయాలని ఒరిజినల్ కంటెంట్ లో ఉన్న కామెడీని మిస్ చేసి ఇక్కడ పంచ్ ల మీద కామెడీ రాయడం లాంటివి చేస్తారు. అదే తప్పు ఈ సినిమాలో కూడా బాగా జరిగింది. అందుకే రన్ అనే సినిమా పరిగెత్తెలా ఉండాల్సింది కాస్తా పాకడం అన్న రేంజ్ కి పడిపోయింది. తెలుగు ప్రేక్షకులకు కమర్షియల్ అంశాలను అందించాలని పాటలను, కామెడీని బలవంతంగా జొప్పించారు. అందుకే ఒరిజినల్ వెర్షన్ లో ఉండే ఫ్రెష్ నెస్ అనేది ఈ సినిమాలో మిస్ అయ్యి జస్ట్ వెరీ రెగ్యులర్ రొటీన్ స్టఫ్ లా తయారైంది. ఓవరాల్ గా కథని, సీన్స్ ని ఏం మార్చలేదు కానీ అందులో ఉన్న ఫ్లో, ఫీల్ మిస్ అయ్యేలా రొమాన్స్, కామెడీ, పంచ్ లు అని కమర్షియల్ అంశాలను మిక్స్ చేసి మంచి కాన్సెప్ట్ ని కల్తీ మద్యంలా చేసేసారు. ఒరిజినల్ వెర్షన్ లో వర్కౌట్ అయ్యిందే సందర్భానుసారంగా వచ్చే కామెడీ, కానీ ఇందులో టిపికల్ తెలుగు కామెడీ సీన్స్ ఫార్మాట్ లోకి మార్చడం వలన పంచ్ డైలాగ్ లు ఉన్నాయే తప్ప కామెడీ లేదు. అందుకే సినిమాలో డైరెక్టర్ తెగ కామెడీ ఉందని ఫీల్ అయినా ఆడియన్స్ మాత్రం నవ్వడం లేదు. పైగా సినిమాకి కీలకం అయిన వడ్డీ రాజు పాత్రని సీరియస్ గా కాకుండా కామెడీగా మార్చడం కంటెంట్ ని తప్పు దోవ పట్టించింది. అలాగే దొంగల ముఠా బాచ్ కోసం కమెడియన్స్ ని నటీనటులుగా ఎంచుకోవడం అస్సలు సెట్ కాని విషయం. దీనివల్ల వచ్చిన నష్టం హీరో - దొంగ చేజ్ సీరియస్ గా అనిపించకపోవడం, దాని వలన ఆడియన్స్ సినిమా నుంచి ఈజీగా డైవర్ట్ అయిపోతారు. ఇక స్క్రీన్ ప్లే తమిళ వెర్షన్ లో ఎలా ఉందొ యాజిటీజ్ గా అలానే ఉంది. కొత్తగా కలిపినా సీన్స్ వలన స్పీడ్ గా ఉండే ఒరిజినల్ స్క్రీన్ ప్లే కాస్త స్లో అయ్యింది. సినిమా ప్రారంభం టైం అనే కాన్సెప్ట్ గురించి చెబుతూ ఆసక్తికరంగా స్టార్ట్ చేసి, అంతే ఆసక్తికరంగా సినిమాని నడిపించాడు. మొదటి అర్థభాగంలో కొన్ని కొన్ని స్లో సీన్స్ ఉన్నా ఫ్లోలో పరవాలేదనిపిస్తుంది. కానీ ఇంటర్వల్ బాంగ్ కి ఇక టార్గెట్ ఏంటి అని తెలిసిపోవడం, కొత్తగా జత చేసిన సీన్స్ బోర్ కొట్టడంతో సెకండాఫ్ స్లోగా, బోరింగ్ గా అనిపిస్తుంది. మళ్ళీ క్లైమాక్స్ దగ్గర ట్విస్ట్ లు రివీల్ చేయడం వలన కాస్త పరవాలేదనిపిస్తుంది. ఒక సూపర్ హిట్ కాన్సెప్ట్ ని డైరెక్టర్ అని కన్నెగంటి సూపర్ అనేలా చేయలేకపోయాడు. ఒరిజినల్ వెర్షన్ లోని సోల్ ని మిస్ చేసి కేవలం సీన్స్ ని మాత్రమే తీసుకొని వారికి అనవసరమైన కమర్షియల్ అంశాలను జత చేయడమే అతని ఫెయిల్యూర్ కి కారణం అని చెప్పాలి. డైరెక్టర్ గా అని కన్నెగంటి మరోసారి ఫెయిల్ అయ్యాడు. 


ఇక మిగతా టెక్నికల్ టీం ఏ రేంజ్ టాలెంట్ చూపించారు అనే విషయానికి వస్తే... బి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ సూపర్.. హైదరాబాద్ లోని లొకేషన్స్ ని, గల్లీలని చాలా ఎఫ్ఫెక్టివ్ గా, కలర్ఫుల్ గా చూపించి తన విజువల్స్ తో అందరినీ స్టన్ చేసాడు. మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ అందించిన పాటలు బాగున్నా సినిమాలో మాత్రం లెంగ్త్ పెంచేసి బోర్ కొట్టించాయి. ఇక నేపధ్య సంగీతం విషయానికి వస్తే 90% ఒరిజినల్ వెర్షన్ లో ఎలా ఉందొ అలానే ఉంది. కావునా బాగుందనే చెప్పాలి. ఎడిటర్ ఎం.ఆర్ వర్మ ఫస్ట్ హాఫ్ ని మేనేజ్ చేసినా సెకండాఫ్ ని మాత్రం మేనేజ్ చేయలేక సాగదీసేసి ఆడియన్స్ చేత ఓహ్ నో... ఇట్స్ బోరింగ్ అనిపించుకున్నాడు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.   

'అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆశపడేపడది సుఖపడినట్లు చరిత్రలో లేదు'.. ఇది తలైవా రజినీకాంత్ చెప్పిన డైలాగ్.. దీనినే రీమేక్ సినిమాలకి ఆపాదిస్తే 'ఒరిజినల్ వెర్షన్ లోని ఫీల్ ని మిస్ చేసి చేసిన రీమేక్ సినిమా, కంటెంట్ ని వదిలేసి కమర్షియాలిటీకి ప్రాధాన్యత ఇచ్చి చేసే రీమేక్ సినిమా ప్రేక్షకులను మెప్పించినట్లు, హిట్ అయినట్టు దాఖలాలు లేవు'. దీన్నిబట్టే సినిమా స్టేటస్ ఏంటనేది మీకు అర్థమైంది అనుకుంటా.. సందీప్ కిషన్ నటించిన ఈ రన్ సినిమా టైటిల్ లో మాత్రమే రన్ ఉంది, సినిమాలో నీరసం, బోరింగ్, స్లో అనే అంశాలే ఉన్నాయి. మొదట్లో పరవాలేదు అనే ఫీలింగ్ ని కలిగించిన మధ్య మధ్యలో ఇంప్రవైజేషన్ లో చేసిన తప్పుల వలన పోను పోను ఆడియన్స్ ఇర్రిటేట్ అయ్యేలా చేసారు. ఫెయిల్యూర్ రీమేక్స్ లో చేరిన మరిఒ సినిమా రన్. టైటిల్ చూసి ప్రేక్షకులు పరిగెత్తిస్తూ ఆడియన్స్ ని థ్రిల్ చేసే సినిమా ఏమో అని థియేటర్స్ లోకి వెళ్ళిన ఆడియన్స్ కాళ్ళు నరికేస్తే వాళ్ళు పాక్కుంటూ వస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఈ సినిమా చూసి బయటకి వచ్చేటప్పుడు ఆడియన్స్ పరిస్థితి. సో ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో ఇలాంటి ఎఫెక్ట్ అవసరమా అనేది మీరే నిర్ణయించుకోండి.  

Sandeep Kishan,Anisha Ambrose,Anil Kanneganti,Sudhakar Cherukuri,Kishore Garikipati,Ajay Sunkara,Sai Karthikరన్ - ఇది చాలా బోరింగ్.. అటేపు వెల్లకండ్రోయ్.!

మరింత సమాచారం తెలుసుకోండి: