లక్ అంటే సన్ని లియోన్ దే అంటున్నాయి బీ టౌన్ వర్గాలు.. పార్న్ స్టార్ కాస్త ఫిల్మ్ స్టార్ అయ్యేసరికి ఆమెకు ఆఫర్ల వెళ్లువతో పాటుగా అంతే క్రేజ్ కూడా దక్కింది.. బాలీవుడ్ సూపర్ హాట్ హీరోయిన్ కమ్ ఐటం గాళ్ కమ్ స్పెషల్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకున్న సన్ని కోసం బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఒకరంటే ఒకరు పోటీ పడిమరి సినిమాల్లో అవకాశం ఇచ్చేస్తున్నారు. 


పోర్న్ స్టార్ అయిన తనని అమీర్ ఖాన్ తన సినిమాలో పెట్టుకుంటాడా అన్న ఓ రిపోర్టర్ మాట అమీర్ చెవిన పడటం ఆమెతో సినిమా చేయడానికి సిద్ధం అని చెప్పడం అంతా జరిగింది. అయితే అమీర్ ఆఫర్ ఇస్తా అన్నాడు కాని బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అవకాశం ఇచ్చేశాడు కూడాను. ప్రస్తుతం తను నటిస్తున్న రాయిస్ సినిమాలో సన్నితో స్టెప్స్ వేయబోతున్నాడు షారుఖ్.


అయితే ఐటం సాంగే కదా అని దాన్ని చీప్ గా తీసేయలేం.. అది బాలీవుడ్ క్రేజీ సాంగ్ అయిన 'లైలా ఓ లైలా' సాంగ్ కావడం విశేషం. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఓ మైలు రాయిగా మిలిగిన ఈ సాంగ్ ఖుర్బాని సినిమాలోనిది. అయితే ఇప్పుడు రాయిస్ కోసం ఈ సాంగ్ ను రీమిక్స్ చేసే పనిలో ఉన్నారు దర్శక నిర్మాతలు. సో సన్నితో అదిరిపోయే సాంగ్ కి స్టెప్పులేయనున్నాడు షారుఖ్ ఖాన్.


ఇక ఈ సినిమా ఈ సంవత్సరం రంజాన్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పటికే షారుఖ్ నటించిన ఫ్యాన్ సినిమా ఏప్రిల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ట్రైలర్స్ తో ట్రెండ్ సెట్ చేస్తున్న ఫ్యాన్ సినిమా షారుఖ్ సినిమాల్లో అదిరిపోయే సినిమాగా నిలవనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: