నాగార్జున, కార్తీ, త‌మ‌న్నా కాంబినేష‌న్లో  ఈ వారం విడుదల కాబోతున్న ‘ఊపిరి’ సినిమా ప్రమోషన్ కు సంభందించి ఏర్పాటు చేసిన  మీడియా సమావేశంలో బయట పడ్డ నాగ్ కార్తి ల భేదాభిప్రాయాలు అందర్నీ  ఆశ్చర్య పరిచాయి.  ఒక విషయమై పొంతన లేకుండా వీరిద్దరూ వేరువేరుగా మాట్లాడటం మీడియాకు చర్చనీయాంశంగా మారింది.  

ఈ మీడియా మీట్ లో మొదట నాగార్జున మాట్లాడుతూ ఇది ఫ్రెంచి చిత్రం ‘ఇన్ టచ్ బుల్స్’ సినిమాకు రీమేక్ ఈసినిమాకు సంబంధించిన కథలోని పాత్రలు యదార్ధం ఇంకా బతికే ఉన్నారు అంటూ నాగ్ కామెంట్ చేస్తూ ఈ సినిమాకు సంబంధించిన అనేక విషయాలను మీడియాకు తెలియ చేసాడు.  అయితే ఆ తర్వాత మైక్ అందుకున్న హీరో కార్తి ‘ఊపిరి’  రీమేక్ కాదు అలా అనద్దు అంటూ మీడియా ముందు మాట్లాడటం  చర్చనీయాంశంగా మారింది. 

అయితే జరుగుతున్న డేమేజ్ ని గ్రహించిన దర్శకుడు వంశీ పైడి పల్లి ‘ఊపిరి’  ఫ్రెంచ్ సినిమాకు అనుసరణ మాత్రమే ఈ సినిమాలో 50 కొత్త సీన్స్ క్రియేట్ చేసామని చెపుతూ నాగ్ కార్తి మధ్య ఏర్పడ్డ ఈ చిన్న భేదాభిప్రాయానికి ముగింపు పలికాడు. ఇదే సందర్భంలో నాగార్జున  మాట్లాడుతూ ఈసినిమాలో నటించిన హీరో కార్తి తనకు తెలుగు సరిగ్గా రాకపోయినా తెలుగును నేర్చుకుని పెజిన్నర డైలాగులను ఒక సింగిల్ టెక్ లో చెప్పినప్పుడు కార్తి ప్రతిభ ముందు తాను నిలబదగాలనా అన్న ఫీలింగ్ తనకు కలిగింది అని అంటూ తన పై తానే సెటైర్ వేసుకున్నాడు.

తనకన్నా వయసులో చిన్నవాడైన కార్తి తెలుగులో మాట్లాడినప్పుడు తానెందుకు తమిళంలో డబ్బింగ్ చెప్పలేనని పంతం వచ్చి తన సొంత గొంతుతో ‘ఊపిరి’ తమిళ వర్షన్ కు డబ్బింగ్ విషయాన్ని బయట పెట్టాడు నాగ్. దాదాపు 2000 వేల ధియేటర్లలో కేవలం ఒక్క అమెరికాలోనే 90 ధియేటర్లలో విడుదల అవుతున్న ఈసినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక నుంచి తన ప్రతిసినిమా సిక్సర్ అని అంటున్న నాగార్జున నమ్మకాన్ని ‘ఊపిరి’ ఎంత వరజు నిలబెడుతుందో చూడాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: