చేయక చేయక చిరంజీవి ఫుల్ లెంథ్ సినిమా చేస్తుంటే అభిమానులు అన్ని రంగాలుగా కూడా సాటిస్ఫై అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు వి.వి.వినాయక్. కత్తి సినిమా రీమేక్ గా వస్తున్న ఈ సినిమా ఇప్పటికే ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అయితే సినిమాలో హీరోయిన్ గా నయనతార ఫైనల్ అయ్యినట్టే సమాచారం.


అమ్మడు ఈ సినిమాలో నటించేందుకు అత్యధికంగా 3.5 కోట్ల భారీ పారితోషికం అడిగిందని టాక్. అయితే అంత ఇవ్వడానికి ఓకే చెప్పిన మెగా ప్రొడ్యూసర్స్ సినిమాలో అమ్మడిని ఫుల్ గా వాడెందుకు సిద్ధమయ్యారు. అయితే వారి ఆలోచనలకు నయన్ బ్రేక్స్ వేసేసింది. ఇంత ఇస్తున్నారు కదా అని బికిని లిప్ లాక్స్ లాంటివంటే అసలు చేయను అనేసిందట. 


కోలీవుడ్లో సూపర్ ఫాంలో ఉన్న ఈ భామ టాలీవుడ్ సినిమాల మీద అసలు ఇంట్రెస్ట్ పెట్టట్లేదని వార్తలు వస్తున్నవే.. అయితే వస్తున్న ఆఫర్లను కాదనకుండా భారీ రెమ్యునరేషన్ అడిగి నిర్మాతలు బెంబేలెత్తేలా చేస్తుంది ఈ భామ. తమిళంలో స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నయన్ ఇరగదీస్తుంది.


మరి మెగాస్టార్ సినిమా అయినా సరే నయన్ ఈ తెగింపు నిర్ణయానికి కాస్త షాక్ అయ్యేలా ఉన్నా భారీ రెమ్యునరేషన్ కాబట్టి మరో పదో పరకో ఇచ్చి నయన్ స్కిన్ షో కూడా సినిమాకు ఎంతో కొంత హెల్ప్ అయ్యేలా చేయాలని దర్శక నిర్మాతల ఆలోచన. ప్రస్తుతం చిరు ఇంట పెళ్లి సందడి జరుగుతుంది. అది పూర్తయ్యాక కాని చిరు 150వ సినిమా గురించి ఓ అధికారిక ప్రకటన వెళువడే అవకాశం ఉంది.    
 



మరింత సమాచారం తెలుసుకోండి: