సినిమా ఇండస్ట్రీలో అంటే ఓ రంగుల ప్రపంచం ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన వారికి నిజంగానే జీవితం అంతా రంగుల మయంగా అవుతుంది..పెద్ద పెద్ద సెలబ్రెటీలు..సొసైటీలో ఎక్కడ లేని గౌరం ప్రత్యేక ఆకర్షణ. బుల్లి తెర, వెండితెరపై ఒక్కసారి కనిపిస్తే చాలు జీవితం ధన్యమైతుందని భావించే ఔత్సాహికులు వేల మంది ఉన్నారు. కానీ అదృష్టం ఎవరినో ఒక్కరినే వరిస్తుంది..ఇలా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన వారి జీవితాలు సుఖమయంగా సాగిపోతున్నాయి..అంటే అంది మాత్రం అసత్యం..ఎందుకంటే సెలబ్రెటీలు అయినంత మాత్రాన కొందరి జీవితాల్లో ఉండే కష్టాలు ఉంటూనే ఉంటాయి.
ఇక హీరోయిన్లుగా ఒక్క వెలుగులు వెలిగిన వారి అకస్మాత్తుగా చాన్సులు తగ్గడం..తమ గ్లామర్ స్థాయి తగ్గిపోయిందని ప్రచారం కావడం సినిమాలో అప్పటి వరకు అందమైన హీరోయిన్లు అన్నవారిని ఒక్కసారే అక్క, అంటీల పాత్రలు వేయమనడం జరిగిపోతుంటాయి. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన హీరోయిన్లు కొంతమంది సెటిలైపోతున్నారు..కొంత మంది హీరోయిన్లు బుల్లితెరపై తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. అలా కానివారు తప్పుడు మార్గంలో వెళ్లి మీడియాకు అడ్డంగా బుక్ అవుతూ తమ జీవితాలు ప్రశ్నార్ధంగా మార్చుకుంటున్నారు. ఇలా వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ హీరోయిన్లు చాలా మంది ఉన్నారు..వారిలో కొందరు..
యమున : బెంగుళూరు నగరంలో ఐటిసి రాయల్ గార్డెనియా (సెవెన్ స్టార్)లో హైటెక్ వ్యభిచారం చేస్తూ నటి యమున బెంగుళూరు సీసీబీ పోలీసులకు దోరికిపోయింది. కన్నడలో రెండు చిత్రాలు, తమిళం, తెలుగులో కూడా పలు చిత్రాలలో యమున హీరోయిన్‌గా నటించడం జరిగింది. సినీనటి యమున వ్యభిచారం నిర్వహిస్తూ అప్పట్లో పోలీసులకు పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి. బెంగళూరులోని ఐటీసీ గార్డెన్ హోటల్లో యమునతోపాటు మరో తొమ్మిదిమంది వ్యభిచారం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. "మౌనపోరాటం" చిత్రంతో తెలుగుతెరపై గుర్తింపు తెచ్చుకున్న యమున తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతోపాటు బుల్లితెరపై అనేక సీరియళ్లలో నటించింది.

భువనేశ్వరి : తమిళ ఇండస్ట్రీలో హాట్ హాట్ గా కుర్రకారుని రెచ్చగొడుతూ వ్యాంప్ పాత్రల్లో నటించిన నటీమణి భువనేశ్వరి అంటే తెలియిని వారు ఉండరు. సినిమాలతో పాటు పలు టీవీ సీరియళ్లలో నటించిన నటి భువనేశ్వరి కూడా ఆ మధ్య వ్యభిచారం చేస్తూ పట్టుడిన సంగతి తెలిసిందే. పట్టబడిన భువనేశ్వరి తాను మాత్రమే కాదు...చాలా మంది స్టార్స్ ఇదే పని చేస్తున్నారని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: